Telangana Covid Update News : తెలంగాణలో తగ్గిన కరోనా.. కొత్తగా ఎన్ని కేసులు అంటే

అత్యధికంగా హైదరాబాద్ లో 25 కేసులు వచ్చాయి. అదే సమయంలో ఒక్కరోజు వ్యవధిలో మరో 44 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. కొత్తగా కరోనా మరణాలేవీ సంభవించలేదు. (Telangana Covid Update News)

Telangana Covid Update News : తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 9వేల 019 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 28 మందికి పాజిటివ్ గా తేలింది. అత్యధికంగా హైదరాబాద్ లో 25 కేసులు వచ్చాయి. అదే సమయంలో ఒక్కరోజు వ్యవధిలో మరో 44 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. కొత్తగా కరోనా మరణాలేవీ సంభవించలేదు.

రాష్ట్రంలో ఇంకా 408 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. నేటివరకు రాష్ట్రంలో కొవిడ్ తో మరణించిన వారి సంఖ్య 4వేల 111. రాష్ట్రంలో నేటివరకు 7,92,599 కరోనా కేసులు నమోదవగా.. 7లక్షల 88వేల 080 మంది కోలుకున్నారు. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఆదివారం రాత్రి కరోనా బులెటిన్ విడుదల చేసింది. క్రితం రోజు రాష్ట్రంలో 13వేల 086 కరోనా టెస్టులు నిర్వహించగా, 45 మందికి పాజిటివ్ గా తేలింది.(Telangana Covid Update News)

North Korea: ఉత్తరకొరియాలో కరోనా వైరస్ స్వైరవిహారం.. వణికిపోతున్న కిమ్ జోంగ్-ఉన్ అడ్డా..

అటు దేశంలో కరోనా వ్యాప్తి కట్టడిలోనే ఉంది. కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. కొన్ని రోజులుగా మూడు వేల లోపే నమోదువుతున్న కొత్త కేసులు తాజాగా 2వేల 500 దిగువకు చేరాయి. మరోవైపు యాక్టివ్ కేసులు కూడా తగ్గుతుండటం రిలీఫ్ ఇచ్చే అంశం.

నిన్న 4,05,156 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 2వేల 487 మందికి పాజిటివ్ గా తేలింది. ఒక్కరోజు వ్యవధిలో కరోనాతో మరో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో నేటివరకు కొవిడ్ తో మృతి చెందిన వారి సంఖ్య 5,24,214కి పెరిగింది. నిన్న మరో 2వేల 878 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకూ వైరస్‌ను జయించిన వారి సంఖ్య 4.25 కోట్లు (98.74%) దాటింది.

కొన్ని రోజులుగా కొత్త కేసుల కంటే రికవరీలే ఎక్కువగా ఉంటుండటంతో.. యాక్టివ్ కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. ప్రస్తుతం దేశంలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 17,692 (0.04%)కు చేరాయి. ఇక దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ నిరంతరాయంగా కొనసాగుతోంది. నిన్న 15,58,119 మంది టీకాలు తీసుకోగా.. ఇప్పటి వరకూ పంపిణీ చేసిన డోసుల సంఖ్య 191.32 కోట్లు దాటింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ ఆదివారం కరోనా బులెటిన్ విడుదల చేసింది.

Kim Jong-un: మారని కిమ్.. నో వ్యాక్సిన్ అట.. అణుబాంబు వేస్తే కరోనా పోతుందా ఏంది..

కరోనా మహమ్మారి వెలుగులోకి వచ్చి రెండేళ్లు దాటిపోయింది. పలు దేశాల్లో బూస్టర్‌ డోసుల పంపిణీ కూడా జరుగుతోంది. మన దేశంలో థర్డ్ వేవ్ పెద్దగా లేదు. అయినా సరే, కరోనా తీవ్ర దశ ముగిసిందని చెప్పలేమంటోంది ప్రపంచ ఆరోగ్య సంస్థ. ‘కొన్ని దేశాలు మహమ్మారి అత్యవసర దశను ముగించగలిగి ఉండొచ్చు. కానీ, అన్ని దేశాల్లో అలాంటి పరిస్థితి లేదు. అందుకే అంతర్జాతీయ స్థాయిలో దీనిపై మన పోరాటం కొనసాగించాలి’ అని డబ్ల్యూహెచ్ఓ వ్యాఖ్యానించింది.

ట్రెండింగ్ వార్తలు