Telangana Corona Report : తెలంగాణలో కొత్తగా 36 కరోనా కేసులు
తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 20,427 కరోనా పరీక్షలు నిర్వహించగా, 36 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది.(Telangana Corona Report)

Telangana Covid Report
Telangana Corona Report : తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 20,427 కరోనా పరీక్షలు నిర్వహించగా, 36 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా హైదరాబాద్ లో 19 కేసులు నమోదయ్యాయి. అనేక జిల్లాల్లో కొత్త కేసులేవీ నమోదు కాలేదు. అదే సమయంలో మరో 75 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కొత్తగా మరణాలేవీ సంభవించలేదు.
ఇక రాష్ట్రంలో ఇప్పటివరకు 7,91,110 మంది కరోనా బారినపడగా… 7,86,463 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ఇంకా 536 మంది కోవిడ్ బాధితులు చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో నేటివరకు కరోనా వల్ల 4,111 మంది మరణించారు. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ శనివారం కరోనా బులెటిన్ విడుదల చేసింది. క్రితం రోజు 20వేల 379 కరోనా పరీక్షలు నిర్వహించగా, 36 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది.
దేశంలో కరోనావైరస్ వ్యాప్తి అదుపులో ఉంది. మహమ్మారి ఉధృతి ప్రారంభ రోజుల నాటి స్థాయికి తగ్గుతూ ఊరటనిస్తోంది. మరోరోజు కొత్త కేసులు 2 వేలకు దిగువనే నమోదయ్యాయి. మరణాలు మాత్రం భారీగా పెరిగాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ శనివారం కరోనా బులెటిన్ విడుదల చేసింది.
శుక్రవారం 6.5 లక్షల మంది కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోగా..1,660 మందికి వైరస్ సోకినట్లు తేలింది. కొంతకాలంగా రోజువారీ పాజిటివిటీ రేటు ఒక శాతం దిగువనే నమోదవుతోంది. కొన్ని రోజులుగా 100 దిగువనే నమోదవుతున్న మరణాలు.. నిన్న 4వేల 100కి పెరిగాయి. మహారాష్ట్ర(4,007), కేరళ(81) మునుపటి గణాంకాలను సవరించడంతో ఈ భారీ తేడా కనిపించింది. దేశంలో నేటివరకు కోవిడ్ తో మరణించిన వారి సంఖ్య 5.20 లక్షలకు చేరింది.
గడిచిన 24 గంటల్లో మరో 2వేల 349 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. యాక్టివ్ కేసులు 20 వేల దిగువకు చేరి 16వేల 741కి తగ్గిపోయాయి. యాక్టివ్ కేసుల రేటు 0.04 శాతానికి పడిపోగా.. రికవరీ రేటు 98.75 శాతానికి పెరిగింది. మరోవైపు దేశంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం దశలవారీగా ముందుకు సాగుతోంది. నిన్న 29.07 లక్షల మంది టీకా వేయించుకోగా.. మొత్తంగా 182 కోట్లకు పైగా డోసులు పంపిణీ అయ్యాయి.
Covid Vaccine: భారత్ లో 12-18 ఏళ్ల వారికి అత్యవసర వినియోగ నిమిత్తం నోవావాక్స్ కు డీజీసీఐ అనుమతి
దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి అదుపులోకి వస్తున్న నేపథ్యంలో కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 31 నుంచి కొవిడ్ నిబంధనలను పూర్తిగా ఎత్తివేయాలని నిర్ణయించినట్లు వెల్లడించింది. అయితే మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటి నిబంధనలు కొనసాగుతాయని స్పష్టం చేసింది. ఈ మేరకు హోంశాఖ కార్యదర్శి అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సమాచారమిచ్చారు.
దేశంలో కొవిడ్ విజృంభించడంతో దాదాపు రెండేళ్ల క్రితం వైరస్ వ్యాప్తి నియంత్రణ కోసం ఈ నిబంధనలను అమల్లోకి తెచ్చిన విషయం తెలిసిందే. కొవిడ్ కట్టడి కోసం 2020 మార్చి 24న విపత్తు నిర్వహణ చట్టం కింద తొలిసారిగా ఈ నిబంధనలతో కూడిన మార్గదర్శకాలను కేంద్రం జారీ చేసింది. ఆ తర్వాత కేసుల సంఖ్యను బట్టి పలుమార్లు వీటిలో మార్పులు, చేర్పులు చేసింది. అయితే, గత ఏడు వారాలుగా దేశంలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఈ నేపథ్యంలోనే నిబంధనలను పూర్తిగా తొలగించాలని హోం మంత్రిత్వ శాఖ నిర్ణయించింది.
Media Bulletin on status of positive cases #COVID19 in Telangana.
(Dated.26.03.2022 at 5.30pm)@TelanganaHealth #StaySafeStayHealthy pic.twitter.com/PyAhXvShTQ— IPRDepartment (@IPRTelangana) March 26, 2022