Telangana Covid Bulletin Update : తెలంగాణలో కొత్తగా ఎన్ని కరోనా కేసులు అంటే..

రాష్ట్రంలో ఇంకా 370 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. నేటివరకు కొవిడ్ తో మరణించిన వారి సంఖ్య 4,111.

Telangana Covid Bulletin Update : తెలంగాణలో కరోనా వ్యాప్తి అదుపులోనే ఉంది. భారీ సంఖ్యలో కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు. రోజువారీ కేసులు 50కి లోపే నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 13వేల 930 కొవిడ్ టెస్టులు చేయగా, కొత్తగా 38 మందికి పాజిటివ్ గా తేలింది. అత్యధికంగా హైదరాబాద్ జిల్లాలో 27 కేసులు వచ్చాయి. అయితే కొత్త కేసుల కంటే రికవరీల సంఖ్య ఎక్కువగా ఉండటం ఊరటనిచ్చే అంశం. అదే సమయంలో ఒక్కరోజు వ్యవధిలో 42 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కొత్తగా కొవిడ్ మరణాలేవీ నమోదు కాలేదు.

రాష్ట్రంలో ఇంకా 370 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. తెలంగాణలో నేటివరకు కొవిడ్ తో మరణించిన వారి సంఖ్య 4,111. రాష్ట్రంలో నేటివరకు 7,92,665 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా… 7,88,184 మంది కోలుకున్నారు. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంగళవారం రాత్రి కరోనా బులెటిన్ విడుదల చేసింది. క్రితం రోజు 12వేల 435 కరోనా టెస్టులు చేయగా.. 28 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది.

North Korea Corona Terror : 7 రోజుల్లో 10లక్షల కరోనా కేసులు.. ఆ దేశంలో కొవిడ్ కల్లోలం

అటు, దేశంలో కరోనా వ్యాప్తి కట్టడిలోనే ఉంది. కరోనా కొత్త కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. తాజాగా 15 వందలకు దిగిరావడం ఊరటనిచ్చే అంశం. కొత్త కేసులు తగ్గుముఖం పట్టడంతో యాక్టివ్ కేసుల సంఖ్య తగింది. కొవిడ్ యాక్టివ్ కేసులు 16 వేలకు పడిపోయాయి.

సోమవారం 3.57 లక్షల మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 1,569 మందికి పాజిటివ్‌గా తేలింది. క్రితం రోజుతో పోలిస్తే 600 మేర కేసులు తగ్గాయి. రోజువారీ పాజివిటీ రేటు 0.44 శాతానికి చేరింది. ఇటీవల కాలంలో రోజువారీ కేసులు మూడు వేల ఎగువకు చేరి ఆందోళన కలిగించాయి. ఫోర్త్ వేవ్ గురించి వార్తలు వచ్చాయి. కానీ కొద్ది రోజులుగా కేసులు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి.

Kim Jong-un : ఉత్తరకొరియాలో మూడురోజుల్లో 8,20,000లకు పైగా కేసులు నమోదు..

ఇక 24 గంటల వ్యవధిలో మరో 2వేల 467 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకూ దేశవ్యాప్తంగా 4.31 కోట్ల మందికి కరోనా సోకగా..98.75 శాతం మంది కోలుకున్నారు. యాక్టివ్ కేసులు 16,400కు తగ్గిపోగా.. ఆ రేటు 0.04 శాతంగా ఉంది. 24గంటల వ్యవధిలో మరో 19 మంది కరోనాతో చనిపోయారు. నేటివరకు దేశంలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 5.24 లక్షలు దాటింది. తాజాగా 10.8 లక్షల మంది టీకా తీసుకున్నారు. కరోనా కట్టడి కోసం కేంద్రం గతేడాది వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభించింది. నేటివరకు 191 కోట్లకు పైగా టీకా డోసులు పంపిణీ అయ్యాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ మంగళవారం కరోనా బులెటిన్ విడుదల చేసింది.

ట్రెండింగ్ వార్తలు