×
Ad

Telangana Covid Cases : తెలంగాణలో కరోనా టెర్రర్.. భారీగా పెరిగిన కేసులు

తెలంగాణలో కరోనావైరస్ మహమ్మారి డేంజర్ బెల్స్ మోగిస్తోంది. వైరస్ చాప కింద నీరులా వ్యాపిస్తోంది. రోజువారీ కేసుల్లో పెరుగుదల ఆందోళనకు గురి చేస్తోంది. తాజాగా ఒక్కరోజు వ్యవధిలో రికార్డులో స్థాయిలో కొత్త కేసులు నమోదవడం టెన్షన్ పెట్టిస్తోంది.

  • Published On : July 26, 2022 / 09:05 PM IST

COVID19 cases in India

Telangana Covid Cases : తెలంగాణలో కరోనావైరస్ మహమ్మారి డేంజర్ బెల్స్ మోగిస్తోంది. వైరస్ చాప కింద నీరులా వ్యాపిస్తోంది. రోజువారీ కేసుల్లో పెరుగుదల ఆందోళనకు గురి చేస్తోంది. తాజాగా ఒక్కరోజు వ్యవధిలో రికార్డులో స్థాయిలో కొత్త కేసులు నమోదవడం టెన్షన్ పెట్టిస్తోంది.

Bill Gates: మంకీపాక్స్ కూడా బిల్‌గేట్స్ కుట్రే.. నిజం ఏంటి?

రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 36వేల 619 కరోనా పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 795 మందికి పాజిటివ్ గా తేలింది. అత్యధికంగా హైదరాబాద్ లో 343 కొత్త కేసులు వచ్చాయి. రంగారెడ్డి జిల్లాలో 54 కేసులు, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 54 కేసులు, నల్గొండ జిల్లాలో 42 కేసులు, పెద్దపల్లి జిల్లాలో 33 కేసులు, ఖమ్మం జిల్లాలో 32 కేసులు, కరీంనగర్ జిల్లాలో 25 కేసులు గుర్తించారు.

అదే సమయంలో ఒక్కరోజు వ్యవధిలో మరో 658 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. ఊరటనిచ్చే మరో అంశం ఏంటంటే.. కొత్తగా కొవిడ్ మరణాలేవీ సంభవించలేదు.

Covid Vaccine: ఒక్క డోసు కూడా తీసుకోని 4 కోట్ల మంది.. కేంద్రం ప్రకటన

రాష్ట్రంలో నేటివరకు 8లక్షల 15వేల 679 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 8లక్షల 06వేల 865 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 4వేల 703గా ఉంది. రాష్ట్రంలో నేటివరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 4వేల 111. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంగళవారం కరోనా బులెటిన్ విడుదల చేసింది. క్రితం రోజు రాష్ట్రంలో 24 గంటల్లో 28వేల 306 కరోనా పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 581 మందికి పాజిటివ్ గా తేలింది.

Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw

కరోనా కేసులు క్రమంగా పెరుగుతుండటంతో ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. ప్రజలకు జాగ్రత్తలు చెప్పింది. కరోనా నిబంధనలు కచ్చితంగా పాటించాలంది. బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు తప్పనిసరిగా ధరించాలని సూచించింది. చేతులను తరుచుగా శుభ్రంగా కడుక్కోవాలంది. అనవసర ప్రయాణాలు చేయొద్దని సూచించింది. పెద్దలు, పిల్లలు మరింత జాగ్రత్తగా ఉండాలని తెలిపింది.