Telangana RTC : తెలంగాణ RTC బంపర్ ఆఫర్.. ఈ బస్సుల్లో టికెట్స్ పై డిస్కౌంట్..

Telangana RTC: హైదరాబాద్ నుంచి ఆంధ్రా, తమిళనాడు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ బంపర్ ఆఫర్ ప్రకటించింది.

Telanana RTC

Telangana RTC : ప్రయాణికుల కోసం తెలంగాణ ఆర్టీసీ (Telangana RTC) బంపర్ ఆఫర్ ప్రకటించింది. హైదరాబాద్ నుంచి ఆంధ్రా, తమిళనాడు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలకు వెళ్లే బస్సుల్లో టికెట్ రేట్లను తగ్గింది.

Also Read: Toll Tax On Two Wheelers: టూ వీలర్స్‌పై టోల్ ట్యాక్స్? అసలు రూల్స్ ఏం చెబుతున్నాయి.. తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన విషయాలు..

హైదరాబాద్ నుంచి ఆంధ్రాలోని కడప, అనంతపురం, ఒంగోలు, కందుకూరు, నెల్లూరు, వైజాగ్, తిరుపతి, అమలాపురం, కాకినాడ, గుంటూరు, తెనాలి, ఆదోని, చీరాల, ఏలూరు, గుడివాడ, కర్నూల్, మాచర్ల, మచిలిపట్నం, మార్కాపురం, నంద్యాల, పామూరు, ఉదయగిరి, వింజమూరు, ధర్మవరం, తాడిపత్రి, రాజమండ్రి వయా ఖమ్మం, తమిళనాడు రాష్ట్రంలోని చెన్నై వంటి ప్రాంతాలకు వెళ్లే లహరి (నాన్ ఏసీ), సూపర్ లగ్జరీ, లహరి (ఏసీ), రాజధాని (ఏసీ) బస్సుల్లో తెలంగాణ ఆర్టీసీ టికెట్ల రేట్లను తగ్గించింది.

 

హైదరాబాద్ నుంచి ఆయా ప్రాంతాలకు వెళ్లే లహరి (నాన్ ఏసీ), సూపర్ లగ్జరీ బస్సుల్లో టికెట్ ధరపై 15శాతం తగ్గింపు ప్రకటించగా.. లహరి (ఏసీ), రాజధాని (ఏసీ) బస్సుల్లో ప్రయాణించే వారికి టికెట్ ధరపై 10శాతం తగ్గిస్తూ తెలంగాణ ఆర్టీసీ నిర్ణయించింది. ఇప్పుడు తక్కువ ఖర్చుతో.. ఎక్కువ సౌకర్యం కల్పిస్తున్నామని ఆర్టీసీ తెలిపింది.


ఇప్పటికే హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే ప్రయాణికులకు ఈ-గరుడ (E-Garuda) ఎలక్ట్రిక్ బస్సుల్లో టికెట్ ధరపై 26శాతం రాయితీని అందజేస్తున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఈ ప్రత్యేక ఆఫర్ ఇప్పటికే అమల్లోకి రావడంతో ప్రయాణికులు తక్కువ ఖర్చుతో సౌకర్యవంతమైన ప్రయాణాన్ని ఆస్వాదించే అవకాశం లభించింది. తాజాగా.. హైదరాబాద్ నుంచి ఆంధ్రాలోని పలు ప్రాంతాలకు వెళ్లే లహరి (నాన్ ఏసీ), సూపర్ లగ్జరీ, లహరి (ఏసీ), రాజధాని (ఏసీ) బస్సుల్లోనూ టికెట్ల రేట్లపై ఆర్టీసీ 15 శాతం, 10శాతం తగ్గింపును ప్రకటించడం గమనార్హం.