Rythu Bharosa: రైతులకు శుభవార్త.. వారందరికీ ఇవాళ ‘రైతు భరోసా’ నిధులు వచ్చేస్తున్నాయ్.. మీ బ్యాంకు ఖాతాలను చెక్ చేసుకోండి..

తెలంగాణ ప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పింది. రెండు ఎకరాల భూమి కలిగిన రైతుల ఖాతాల్లో ‘రైతు భరోసా’ నగదును జమ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు..

Telangana Rythu Bharosa Scheme

Rythu Bharosa: తెలంగాణ ప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పింది. రెండు ఎకరాల భూమి కలిగిన రైతుల ఖాతాల్లో ‘రైతు భరోసా’ నగదును జమ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. దీంతో ఇవాళ్టి నుంచి లేదా మంగళవారం నుంచి నేరుగా రైతుల ఖాతాల్లో నగదు జమ కానుంది. ఇప్పటికే ఎకరం భూమి కలిగిన రైతులకు ప్రభుత్వం రైతు భరోసా నిధులను జమ చేసిన విషయం తెలిసిందే. ఎకరం భూమి కలిగిన సుమారు 17లక్షల మంది రైతులకు పెట్టుబడి సాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందించింది. తాజాగా.. రెండు ఎకరాల వరకు ఉన్నవారికి ప్రభుత్వం రైతు భరోసా నిధులను వారి ఖాతాల్లో జమ చేయనుంది.

Also Read: Rangarajan : చిలుకూరు బాలాజీ ఆలయం ప్రధాన అర్చకులు రంగరాజన్‌పై దాడి.. రౌండప్ చేసి, కింద కూర్చోబెట్టి, వార్నింగ్ ఇస్తూ.. షాకింగ్ వీడియో..

తెలంగాణ సర్కారు ఇటీవలే రైతు భరోసాతో పాటు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల పథకాలను ప్రారంభించిన విషయం తెలిసిందే. వాటిని వేర్వేరుగానే అమలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి సర్కారు నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ‘రైతు భరోసా’ కింద రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు ప్రభుత్వం ప్రతీయేటా ఎకరాకు రూ. 12వేలు అందజేసేందుకు నిర్ణయించింది. తొలి విడతలో భాగంగా ప్రస్తుతం అర్హులైన రైతుల ఖాతాల్లో ఎకరానికి రూ.6వేలు జమ చేస్తుంది. జనవరి 26వ తేదీ నుంచే ఈ పథకాన్ని ప్రారంభించిన ప్రభుత్వం.. ముందుగా 563 గ్రామాల్లోని రైతుల ఖాతాల్లోకి నగదు జమ చేసింది. రెండో విడతగా ఎకరం సాగు భూమి ఉన్న రైతులకు పెట్టుబడి సాయాన్ని ఇటీవల ప్రభుత్వం అందించింది. ఇప్పుడు రెండు ఎకరాల భూమి కలిగిన రైతుల బ్యాంక్ ఖాతాల్లో రైతు భరోసా నగదును ప్రభుత్వం జమ చేసేందుకు సిద్ధమైంది.

Also Read: Harish Rao : కందులు పండించడమే ఆ రైతులు చేసిన నేరమా?- కాంగ్రెస్ సర్కార్ పై హరీశ్ రావు ఫైర్

రైతులకు రెండు విడుతల్లో ఎకరాకు రూ.12 వేలు చొప్పున పెట్టుబడి సాయం అందించేందుకు ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఎకరాకు రూ.6వేలు చొప్పున అందిస్తుంది. ఇందులో భాగంగా తొలి విడతలో 563 గ్రామాల్లో నిధులు విడుదల చేయగా.. ఇటీవల ఎకరం వరకు సాగులో ఉన్న భూములకు ఎకరాకు రూ.6వేల చొప్పున ప్రభుత్వం అర్హులైన రైతుల ఖాతాల్లో నిధులు జమ చేసింది. దీంతో రైతు భరోసా పంట పెట్టుబడి సాయం కింద జనవరి 27 నుంచి ఫిబ్రవరి 6వ తేదీ వరకు మొత్తంగా 21,45,330 మందికి రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ. 1,126 కోట్లు జమ చేసినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.

 

‘రైతు భరోసా’ నిధులను దశల వారిగా మార్చి 31వ తేదీ వరకు అర్హులైన రైతులందరికీ వారివారి బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ఇటీవల ఎకరా వరకు పొలం కలిగిన రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ చేసిన ప్రభుత్వం.. ఇవాళ లేదా రేపటి నుంచి రెండు ఎకరాల భూమి కలిగిన రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.