దూసుకపోతున్న తెలంగాణ..తలసరి ఆదాయంలో దేశంలోనే సెకండ్ ప్లేస్

  • Published By: madhu ,Published On : October 31, 2020 / 08:46 AM IST
దూసుకపోతున్న తెలంగాణ..తలసరి ఆదాయంలో దేశంలోనే సెకండ్ ప్లేస్

Updated On : October 31, 2020 / 10:41 AM IST

Telangana Second place : కరోనా ఉక్కిరిబిక్కిరి చేస్తున్నా.. ప్రభుత్వ చర్యలతో తెలంగాణ ఆర్థికంగా అభివృద్ధి పథంలో దూసుకుపోతుంది. కేసీఆర్ సారథ్యంలో కొత్త రికార్డులను సొంతం చేసుకుంటుంది. తలసరి ఆదాయంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే రెండో స్థానానికి ఎగబాకింది. ఐటీ, రియల్‌ఎస్టేట్‌కు వ్యవసాయ రంగం తోడవడం వల్లే గ్రోత్‌ రేట్‌ సాధ్యమైందని ప్రభుత్వం చెబుతుంది.



సంక్షేమ పథకాలతో దూసుకుపోతున్న తెలంగాణ.. పరిపాలనలో సంస్కరణలకు నాంది పలికింది. ఆర్థిక క్రమశిక్షణను అవలంభిస్తూ… పక్కా ప్రణాళికలతో ముందుకు వెళ్తూ రాష్ట్ర త‌ల‌స‌రి ఆదాయాన్ని గ‌ణ‌నీయంగా పెంచుకుంది. గ‌తంలో ఎన్నడూ లేనివిధంగా దేశంలో త‌ల‌స‌రి ఆదాయంలో రెండ‌వ స్థానాన్ని సొంతం చేసుకుంది. 13.3 శాతం గ్రోత్ రేట్ తో.. తెలంగాణ సెకండ్ ప్లేస్ లో నిల‌వ‌గా.. సిక్కిం 13.7 శాతం గ్రోత్ రేట్ తో మొదటిస్థానంలో ఉంది. నాలుగు, ఐదు, ఆరో స్థానాల్లో త్రిపుర, మధ్యప్రదేశ్‌, కర్నాటక రాష్ట్రాలు నిలిచాయి. ఏపీ ఏడో ప్లేస్‌ను దక్కించుకుంది.



2019-20 ఆర్థిక సంవ‌త్సరానికి గాను రాష్ట్ర త‌ల‌స‌రి ఆదాయం.. 2 లక్షల 28 వేల 216 రూపాయలు ఉంది. అయితే.. ప్రస్తుతం దేశ త‌ల‌స‌రి ఆదాయం లక్షా 36 వేల 432 రూపాయలు ఉంది. అంటే దేశ తలసరి ఆదాయానికి తెలంగాణలో రెండింతలు ఉండటం విశేషం. ఓ వైపు కరోనా కలవరపెట్టినప్పటికీ.. ప్రభుత్వం ముందు చూపుతో వ్యవహరించడం వల్లే తలసరి ఆదాయం పెరిగిందని విశ్లేషకులు చెబుతున్నారు.



https://10tv.in/will-chandrababu-gives-green-signal-to-kommalapati-sridhar/
హైదరాబాద్‌లో ఐటీ, రియల్‌ ఎస్టేట్‌ రంగాలు దూసుకెళ్లడం వల్లే గ్రోత్ రేట్ సాధ్యమైందని అంటున్నారు. కాళేశ్వరం, సీతారామ ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తిచేయడం వల్ల తెలంగాణ వ్యవసాయ రంగం మరింత బలోపేతమైంది. ఆయ‌క‌ట్టులో గ‌తంలో ఎప్పుడు లేనంత‌గా పంటలు పండటం కూడా గ్రోత్‌ రేట్‌కు కారణమంటున్నారు అధికారులు. అభివృద్ధిలో వేగం ఇలాగే కొనసాగితే గ్రోత్‌రేట్‌లో తెలంగాణ మొదటి స్థానానికి చేరుకోవడం ఖాయంగా కనిపిస్తుంది