Senior Resident Doctors : సీనియర్ రెసిడెంట్ డాక్టర్ల జీతాల పెంపు

సీనియర్ రెసిడెంట్ డాక్టర్ల జీతాలు పెరిగాయి. 15 శాతం జీతాలు పెంచుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రూ. 70 వేల నుంచి రూ. 80 వేల 500కు పెంచింది. పెరిగిన శాలరీ ఈ ఏడాది జనవరి నుంచి అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది టీ సర్కార్.

Salary Increase : సీనియర్ రెసిడెంట్ డాక్టర్ల జీతాలు పెరిగాయి. 15 శాతం జీతాలు పెంచుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రూ. 70 వేల నుంచి రూ. 80 వేల 500కు పెంచింది. పెరిగిన శాలరీ ఈ ఏడాది జనవరి నుంచి అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది టీ సర్కార్.

తెలంగాణ జూనియర్ డాక్టర్లు సమ్మె చేయడంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. ముఖ్యమంత్రి కేసీఆర్..స్పందించి..వారి వేతనాలను పెంచడానికి  గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ మేరకు జీవో విడుదలైంది. సీనియర్ రెసిడెంట్ డాక్టర్లు ఉన్న వారికి 15 శాతం జీతం పెంచాలని నిర్ణయం తీసుకుంది. జనవరి 01 నుంచి అమల్లోకి వస్తుందని..ప్రభుత్వం వెల్లడించింది. ఈ నిర్ణయంపై జూనియర్ డాక్టర్లు సంతోషం వ్యక్తం చేశారు.

స్టయిఫండ్ తో పాటు మరికొన్ని సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. ఎక్స్ గ్రేషియా విషయంలో సందిగ్ధత నెలకొంది. ఇప్పటికే కేంద్రం ఎక్స్ గ్రేషియా అందిస్తోంది. దీనిని అందించలాంటే..కొన్ని టెక్నికల్ సమస్యలు ఏర్పడుతాయని ప్రభుత్వం భావిస్తోంది. సాంకేతికపరమైన సంబంధించి న్యాయనిపుణుల సలహాలు తీసుకొంటోంది. దీనిపై పునరాలోచించాలని, తొందరపడి సమ్మె చేయవద్దని..ప్రజలను ఇబ్బంది పెట్టవద్దని ప్రభుత్వం సూచిస్తోంది.

Read More : Chitrapuri Colony : చిత్రపురి కోవిడ్ బాధితులకు అండగా ‘‘మనం సైతం’’..

ట్రెండింగ్ వార్తలు