Sonu Sood- Anchor Vindhya: యాంకర్ వింధ్యాపై సోనూసూద్ ప్రశంసలు.. కారణం ఏంటంటే?

దేవుడు ఉన్నాడో లేడో తెలియదు కానీ కరోనా సమయంలో ఎందరో పేదల పాలిట నిజంగానే దేవుడయ్యాడు సోనూసూద్. గత ఏడాది లాక్ డౌన్ లో దిక్కుతోచని స్థితిలో ఉన్న ఎందరినో ఆదుకున్న సోనూ అప్పటి నుండి ఇప్పటి వరకు అడిగిన వాళ్ళకు అడిగినట్లు సాయం చేస్తూనే ఉన్నాడు.

Sonu Sood- Anchor Vindhya: యాంకర్ వింధ్యాపై సోనూసూద్ ప్రశంసలు.. కారణం ఏంటంటే?

Sonu Sood Praises Anchor Vindhya The Reaso Of Donation

Updated On : May 27, 2021 / 5:50 PM IST

Sonu Sood- Anchor Vindhya: దేవుడు ఉన్నాడో లేడో తెలియదు కానీ కరోనా సమయంలో ఎందరో పేదల పాలిట నిజంగానే దేవుడయ్యాడు సోనూసూద్. గత ఏడాది లాక్ డౌన్ లో దిక్కుతోచని స్థితిలో ఉన్న ఎందరినో ఆదుకున్న సోనూ అప్పటి నుండి ఇప్పటి వరకు అడిగిన వాళ్ళకు అడిగినట్లు సాయం చేస్తూనే ఉన్నాడు. ఈ ఏడాది సెకండ్ వేవ్ లో ఆక్సిజన్ నుండి ఆసుపత్రులలో బెడ్స్ వరకు ఏది కావాలన్నా పేదలకు, దిక్కుతోచని స్థితిలో ఉన్న వారికి ముందుగా గుర్తొచ్చేది సోనూసూద్ ఒక్కడే. అంతగా సోనూసూద్ చేసే సేవలకు ప్రశంసించని ప్రముఖులు.. కీర్తించని ప్రజలు లేరు.

అయితే.. అలాంటి సోనూ ఇప్పుడు మన తెలుగులో స్పోర్ట్స్ యాంకర్ గా గుర్తింపు తెచ్చుకున్న వింధ్యాపై ప్రశంసల జల్లు కురిపించాడు. అందుకు కారణం కూడా ఆ సేవా గుణమే. సోనూ సేవలకు ఎందరో సెలబ్రిటీలు కూడా ముగ్ధులై వాళ్ళకి తోచిన విరాళాలను ఇచ్చి ప్రోత్సహిస్తున్న సంగతి తెలిసిందే. కాగా.. యాంకర్‌ వింధ్యా కూడా తన వంతు సాయంగా సోనూసూద్‌ ఫౌండేషన్‌కు విరాళం అందించింది. తన కాస్టూమ్స్‌ను వేలం వేసి వచ్చిన నగదు మొత్తాన్ని ఫౌండేషన్‌కు పంపించింది. దీనిపై స్పందించిన సోనూసూద్‌ ప్రత్యేకంగా వీడియో రూపంలో కృతజ్ఞతలు తెలియజేశాడు.

ఈ విషయాన్ని యాంకర్ వింధ్యా ఇన్ స్టా ద్వారా అభిమానులతో షేర్ చేసుకుంది. సోనూ పంపిన ఆ వీడియోలో.. హాయ్‌ వింధ్యా విశాఖ.. మీరు చేసిన సాయానికి చిన్న థాంక్స్‌ అనే పదం సరిపోదు. సోనూసూద్‌ ఫౌండేషన్‌పై విశ్వాసం ఉంచినందుకు కృతజ్ఞతలు. మీరు నిజమైన రాక్‌స్టార్‌. మీరు చేసిన సహాయం పేదల ముఖాలపై నవ్వులు వెలిగిస్తుందని.. మీకు మంచి భవిష్యత్‌ ఉండాలని కోరుకుంటున్నా. జాగ్రత్తగా ఉండండి’ అంటూ సోనూసూద్ పేర్కొన్నారు. ఈ వీడియో కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.