తెలంగాణలో టెన్త్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్.. డేట్ ఫిక్స్.. మెమోల విధానంలో కీలక మార్పులు.. సబ్జెక్టుల వారిగా మార్కులు, గ్రేడ్లు

టెన్త్ మెమోల విధానంలో ప్రభుత్వం మార్పులు చేసింది. ఇప్పటి వరకూ గ్రేడింగ్ విధానంలో మెమోలు ఇచ్చేవారు. కానీ, ప్రస్తుతం నుంచి ..

Telangana SSC Results 2025

Telangana SSC Results 2025: తెలంగాణలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు రాసిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే పక్క రాష్ట్రం ఏపీలో టెన్త్ ఫలితాలు విడుదలయ్యాయి. తెలంగాణలో ఇంటర్ రిజల్ట్స్ వచ్చేశాయి. కానీ, పదో తరగతి ఫలితాలు వెల్లడి ఆలస్యం కావటంతో విద్యార్థులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. అయితే, తాజాగా.. ఫలితాల విడుదల తేదీపై క్లారిటీ వచ్చేసింది.

Also Read: AP Police Constable Mains Exam: పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. మెయిన్స్ ఎగ్జామ్ తేదీ ఖరారు, పరీక్ష కేంద్రాలు ఇవే..

తెలంగాణలో ఈనెల 30వ తేదీన పదవ తరగతి పరీక్షల ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. అధికారులు ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఫలితాలను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విడుదల చేసే అవకాశం ఉంది. వాస్తవానికి వారం రోజుల క్రితమే టెన్త్ మూల్యాంకన ప్రక్రియ, మార్కుల కంప్యూటరీకరణ, పలు దఫాలుగా సమాధాన పత్రాలు వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తయింది. అయితే, విద్యాశాఖ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధీనంలోనే ఉంది. ఈ కారణంగా ఆయన చేతుల మీదుగా ఫలితాలు విడుదల చేయించాలని అధికారులు భావించారు. ఈ విషయంపై ఇటీవల రేవంత్ రెడ్డిని విద్యాశాఖ ఉన్నతాధికారులు కలిసి ఫలితాల విడుదల విషయంపై చర్చించారు. ఈ క్రమంలో ఫలితాల విడుదల బాధ్యత డిప్యూటీ సీఎంకు అప్పగించినట్లు తెలిసింది. దీంతో ఈ మేరకు ఫలితాల విడుదలపై అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.

Also Read: TS Inter Results 2025: తెలంగాణ ఇంటర్‌ ఫలితాల్లో టాప్ జిల్లాలు, వెనుకబడిన జిల్లాలు ఇవే..

మరోవైపు టెన్త్ మెమోల విధానంలో ప్రభుత్వం మార్పులు చేసింది. ఇప్పటి వరకూ గ్రేడింగ్ విధానంలో మెమోలు ఇచ్చేవారు. కానీ, ప్రస్తుతం నుంచి ప్రతి సబ్జెక్టులో గ్రేడింగ్ తో పాటు, విద్యార్థి మార్కులు మెమోలో పొందుపరుస్తారు. ఇంటర్నల్, ఎక్స్ టర్నల్ మార్కులు, జీపీఏ మెమోలో ఉంటాయని విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా ఆదివారం జారీ చేసిన ఆదేశాల్లో పేర్కొన్నారు.

 

ఈనెల 30వ తేదీన పదో తరగతి పరీక్షల ఫలితాలు విడుదల చేసేందుకు తెలంగాణ విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తుండగా.. ఫలితాలు వెలువడిన నెల రోజుల్లో అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్ష నిర్వహించాలని అధికారులు నిర్ణయించినట్లు తెలిసింది.

తెలంగాణ టెన్త్ ఫలితాలు విడుదలైన తర్వాత విద్యార్థులు తమ TS SSC మార్క్స్ మెమో 2025ను తెలంగాణ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌ల (bse.telangana.gov.in, bseresults.telangana.gov.in) నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.