AP Police Constable Mains Exam: పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. మెయిన్స్ ఎగ్జామ్ తేదీ ఖరారు, పరీక్ష కేంద్రాలు ఇవే..

అభ్యర్థులు మరింత సమాచారం తెలుసుకునేందుకు slprb.ap.gov.in వెబ్‌సైట్‌ ను సందర్శించాలని పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు వెల్లడించింది.

AP Police Constable Mains Exam: పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. మెయిన్స్ ఎగ్జామ్ తేదీ ఖరారు, పరీక్ష కేంద్రాలు ఇవే..

Updated On : April 24, 2025 / 9:59 PM IST

AP Police Constable Mains Exam: ఆంధ్రప్రదేశ్‌లో పోలీస్‌ కానిస్టేబుల్‌ అభ్యర్థులకు బిగ్ అలర్ట్. తుది రాత పరీక్ష డేట్ వచ్చేసింది. జూన్‌ 1న మెయిన్స్‌ రాత పరీక్ష నిర్వహించనున్నట్లు ఏపీ పోలీస్ నియామక మండలి ప్రకటించింది. విశాఖ, కాకినాడ, గుంటూరు, కర్నూలు, తిరుపతిలో పరీక్ష కేంద్రాలుంటాయని తెలిపింది. జూన్ 1 ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష ఉంటుంది.

2023 జనవరిలో నిర్వహించిన ప్రాథమిక పరీక్షకు 4.59 లక్షల మంది హాజరయ్యారు. 95వేల 208 మంది అర్హత సాధించారు. వీరికి 2024 డిసెంబర్ లో దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించారు. ఇందులో 38వేల 910 మంది అర్హత సాధించారు. వీరందరికీ జూన్‌ 1న రాత పరీక్ష నిర్వహించనున్నారు. అభ్యర్థులు మరింత సమాచారం తెలుసుకునేందుకు slprb.ap.gov.in వెబ్‌సైట్‌ ను సందర్శించాలని పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు వెల్లడించింది.

రాష్ట్ర వ్యాప్తంగా వివిధ కేంద్రాల్లో పోలీస్ కానిస్టేబుల్ రాత పరీక్షను నిర్వహించడానికి కమిషన్ ఏర్పాట్లు చేసింది. ఏపీ పోలీస్ కానిస్టేబుల్ మెయిన్స్ హాల్ టికెట్ 2025 పరీక్షకు కనీసం ఒక వారం ముందు విడుదల చేయబడుతుంది. అభ్యర్థులకు ఈ కింది ఐదు కేంద్రాలలో ఏదైనా ఒకటి కేటాయించబడుతుంది.

* విశాఖపట్నం
* కాకినాడ
* గుంటూరు
* కర్నూలు
* తిరుపతి

* మెయిన్స్ ఎగ్జామ్ 200 మార్కులకు ఉంటుంది. పరీక్ష సమయం 3 గంటలు.

సబ్జెక్స్ ఇవే..
ఇంగ్లీష్
అర్థమెటిక్
రీజనింగ్
మెంటల్ అబిలిటి
జనరల్ సైన్స్
ఇండియా హిస్టరీ
ఇండియా కల్చర్
ఇండియన్ నేషనల్ మూమెంట్
ఇండియన్ జాగ్రఫీ
పాలిటీ అండ్ ఎకానమీ
కరెంట్ ఈవెంట్స్(నేషనల్, ఇంటర్ నేషనల్)

 

Also Read: రేపే ఆకాశంలో స్మైలీ మూన్.. చూడొచ్చా, లేదా? చూస్తే మంచిదా, కాదా? జ్యోతిష్య పండితులు ఏం చెబుతున్నారు..

మరోవైపు ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ప్రస్తుతం ఉన్న 957మంది గెస్ట్ ఫ్యాకల్టీలకు మరో ఏడాది పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం.