Smiley Face Moon: రేపే ఆకాశంలో స్మైలీ మూన్.. చూడొచ్చా, లేదా? చూస్తే మంచిదా, కాదా? జ్యోతిష్య పండితులు ఏం చెబుతున్నారు..
సూర్యుడికి ఇష్టమైనటువంటి వాడు చంద్రుడు. చాలా దగ్గరలో ఉండేవాడు చంద్రుడు. అలాంటి చంద్రుడు స్మైలీగా కనిపించడం అనేది..

Smiley Face Moon: ఈ నెల 25న ఆకాశంలో అద్భుతం ఆవిష్కృతం కానుంది. అదే స్మైలీ మూన్. ఇప్పటివరకు మనం బ్లూ మూన్ చూశాం, రెడ్ మూన్ చూశాం, గ్రీన్ మూన్ చూశాం.. బట్ ఈ స్మైలీ మూన్ ఏంటి అనుకుంటున్నారా.. స్మైలీ మూన్ ఎందుకు ఏర్పడుతుంది? ఎలా ఏర్పడుతుంది? ఎప్పుడెప్పుడు ఏర్పడుతుంది? జ్యోతిష్యపరంగా దీని వల్ల ఎలాంటి ప్రభావం ఉండబోతోంది? ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీనివాసుల అనంతరామ శర్మ మాటల్లో తెలుసుకుందాం.
స్మైలీ మూన్ అంటే ఏమిటి, ఎప్పుడెప్పుడు ఏర్పడుతుంది..
సెల్ ఫోన్ లో స్మైలీ సింబల్స్ ఎలా ఉంటాయో.. అచ్చం అలానే ఆకాశంలో 25న సూర్యోదయానికి ఒక గంట, గంటన్నర ముందు స్మైలీ ఫేస్ మూన్ కనిపిస్తుంది. అలా కనబడటం ఒక రకంగా అద్భుతం అనే చెప్పొచ్చు. అది శుక్రుడు, శని, చంద్రుడు..ఈ ముగ్గురి కలయికతో ఇది ఏర్పడుతుంది.
ఈ సంవత్సరం మొత్తానికి అధిపతి సూర్యుడు. కాబట్టి సూర్యుడికి ఇష్టమైనటువంటి వాడు చంద్రుడు. చాలా దగ్గరలో ఉండేవాడు చంద్రుడు. అలాంటి చంద్రుడు స్మైలీగా కనిపించడం అనేది చాలా అద్భుతమైనది. అంతేకాకుండా సూర్యుడి కాంతి ఈ రెండు నక్షత్రాల మీద పడి మనకి ఈసారి ప్రత్యక్షంగా కనపించనుంది ఆకాశంలో. ఎవరైతే దర్శిస్తారో వారికి చాలా మంచి జరుగుతుందని పెద్ద వాళ్లు చెబుతున్నారు.
Also Read: రేపే ఆకాశంలో ‘స్మైలీ ఫేస్ మూన్’.. ప్రత్యేకత ఏంటి? ఈ అద్భుతమైన దృశ్యాన్ని అసలు మిస్ కావొద్దు!
దీన్ని దర్శించాలంటే నియమాలు కూడా ఉన్నాయి. తెల్లవారుజామునే స్మైలీ మూన్ కనిపించడానికి ముందే లేచి వీలుంటే తలంటి స్నానం చేయాలి. ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉంటే మామూలు స్నానం చేయొచ్చు. అనంతరం స్మైలీ మూన్ ను దర్శించుకుంటే చాలామంది ఫలితాలు వస్తాయన్నది శాస్త్రంలో ఉంది.
స్మైలీ మూన్ ఎన్నేళ్లకు ఒకసారి వస్తుంది..
15 నుంచి 20 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. లేదా 20 సంవత్సరాలు దాటిన తర్వాతైనా వస్తుంది. ఎందుకు ఇలా వస్తుంది అంటే.. గ్రహాలు సంచరిస్తుంటాయి. గ్రహాలు సంచరిస్తున్న సమయంలో అవి మనకు కనపడుతూ ఉంటాయి. ఈసారి మూడు గ్రహాలు ఒకేసారి కనిపిస్తాయి. ఇది అద్భుతం అనే చెప్పొచ్చు.
మరిన్ని ఇంట్రస్టింగ్ స్టోరీలు, అప్‌డేట్స్ కోసం 10టీవీ వాట్సాప్ చానల్‌ని ఫాలో అవ్వండి.. Click Here