TS Inter Results 2025: తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో టాప్ జిల్లాలు, వెనుకబడిన జిల్లాలు ఇవే..
మహబూబాబాద్ జిల్లాలో అత్యల్పంగా 48.43 శాతం ఉత్తీర్ణత నమోదైంది.

తెలంగాణ ఇంటర్మీడియట్ 2025 రిజల్ట్స్ మంగళవారం విడుదలయ్యాయి. జిల్లాల వారీగా చూస్తే ద్వితీయ సంవత్సరంలో ములుగు, ప్రథమ సంవత్సరంలో మేడ్చల్ అగ్రస్థానంలో ఉన్నాయి. ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో కామారెడ్డి, ప్రథమ సంవత్సర ఫలితాల్లో మహబూబాబాద్ జిల్లాల్లో ఉత్తీర్ణత శాతం అత్యల్పంగా నమోదైంది.
TG Inter 1st, 2nd Year Results 2025
ద్వితీయ సంవత్సరంలో..
ములుగు జిల్లాలో ఉత్తీర్ణత శాతం 81.06
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఉత్తీర్ణత శాతం 80.24
మేడ్చల్ జిల్లాలో ఉత్తీర్ణత శాతం 77.91
కామారెడ్డి జిల్లాలో అత్యల్పంగా 56.38 శాతం ఉత్తీర్ణత
ప్రథమ సంవత్సరంలో..
మేడ్చల్ జిల్లాలో 77.21 శాతం ఉత్తీర్ణత
రంగారెడ్డి జిల్లాలో 76.36 శాతం ఉత్తీర్ణత
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో 70.52 శాతం ఉత్తీర్ణత
మహబూబాబాద్ జిల్లాలో అత్యల్పంగా 48.43 శాతం ఉత్తీర్ణత
కాగా, మే 22 నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. అలాగే, ప్రాక్టికల్ పరీక్షలు జూన్ 3 నుంచి జూన్ 6 వరకు జరుగుతాయి. సప్లిమెంటరీ పరీక్షల ఫీజును ఏప్రిల్ 23 నుంచి 30 వరకు వారి కాలేజీల్లో చెల్లించాలి.