KCR : మాజీ సీఎం కేసీఆర్‌కు భద్రత కుదింపు

భద్రతపై ఇంటెలిజెన్స్‌శాఖ సమీక్ష నిర్వహించింది. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీ నుంచి ఓడిపోయిన ఎమ్మెల్యేలందరికీ భద్రతను పోలీస్ శాఖ పూర్తిగా తీసి వేసింది.

former CM KCR

KCR Security Reduced : బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌కు భద్రతను రాష్ట్ర పోలీసు శాఖ కుదించింది. కేటీఆర్‌, హరీశ్‌రావు సహా గెలిచిన మాజీ మంత్రులకు, ఎమ్మెల్యేలకు భద్రత కేటాయింపు చేశారు. మాజీ సీఎం కేసీఆర్‌కు ప్రస్తుతం వై క్యాటగిరీ భద్రతను కేటాయించారు. టీపీఆర్‌కు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.

ఎమ్మెల్యేలుగా ఎన్నికైన మాజీ మంత్రులకు 2+2 భద్రతను కొనసాగిస్తున్నారు. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీ నుంచి ఓడిపోయిన ఎమ్మెల్యేలందరికీ భద్రతను పోలీస్ శాఖ పూర్తిగా తీసి వేసింది. భద్రతపై ఇంటెలిజెన్స్‌శాఖ సమీక్ష నిర్వహించింది.

Governor Tamilisai : ప్రజా పాలన మొదలైంది.. తెలంగాణ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం

మాజీ ప్రజాప్రతినిధులు, మంత్రులకు ప్రాణహాని, ఇతరుల నుంచి ముప్పుగానీ లేదని అంచనాకు వచ్చిన తర్వాతే వారి భద్రతను తొలగించారు. ఇంటెలిజెన్స్‌ సెక్యూరిటీ వింగ్‌ నుంచి గన్‌మెన్‌లను పోలీసు శాఖ రీకాల్‌ చేసింది.