Journalists: జర్నలిస్టులకు రూ. 30 లక్షల ఆరోగ్య బీమా.. టీయుడబ్ల్యూజే కీలక నిర్ణయం
ఢిల్లీలో పనిచేస్తున్న జర్నలిస్టులకు, వారి కుటుంబ సభ్యులకు మూడు సంవత్సరాల పాటు ఆరోగ్య రక్షణ కల్పిస్తూ ఈ ఏడాది టీయుడబ్ల్యూజే సర్వసభ్య సమావేశం నిర్ణయం తీసుకుంది.

telangana union of working journalists provide health insurance for their members
Journalists Insurance: తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టు ఢిల్లీ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. తమ యూనియన్ సభ్యులకు ఉచితంగా మూడేళ్ల పాటు ఆరోగ్య బీమా (health insurance) కల్పించింది. పుట్టిన ఊరికి, కుటుంబ సభ్యులకు దూరంగా ఢిల్లీలో పనిచేస్తున్న జర్నలిస్టుల ఆరోగ్య రక్షణ, సంక్షేమం కోసం టియూడబ్ల్యూజే (TUWJ) నిజాయితీ, నిబద్ధతతో తన కర్తవ్యాన్ని నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా గత రెండేళ్ల నుంచి ఏటా పది లక్షల రూపాయల ఆరోగ్య బీమాను ఉచితంగా కల్పిస్తోంది. ఢిల్లీలో పనిచేస్తున్న జర్నలిస్టులకు, వారి కుటుంబ సభ్యులకు మూడు సంవత్సరాల పాటు ఆరోగ్య రక్షణ కల్పిస్తూ ఈ ఏడాది టీయుడబ్ల్యూజే సర్వసభ్య సమావేశం నిర్ణయం తీసుకుంది.
ఈ మేరకు తెలంగాణ భవన్ (Telangana Bhavan) లోని గురజాడ హాల్లో ఢిల్లీ యూనియన్ అధ్యక్షుడు నాగిల్ల వెంకటేష్ చేతుల మీదుగా జర్నలిస్టులందరికీ ఆరోగ్య బీమా ప్రీమియం చెక్కులను అందజేసింది. దాదాపు 1100 రోజులపాటు ఈ ఆరోగ్య రక్షణ వర్తిస్తుంది. ఏడాదికి పది లక్షల రూపాయల కవరేజ్ చొప్పున మూడు సంవత్సరాలకు 30 లక్షల రూపాయల కవరేజ్ యూనియన్ కల్పించడం జరిగింది. మొత్తం ఐదేళ్లపాటు యూనియన్ సభ్యులందరికీ 10 లక్షల రూపాయల ఆరోగ్య బీమాను ఉచితంగా కల్పించి కమిటీ తన సభ్యుల శ్రేయస్సు కోసం అకుంఠిత నిబద్ధతను చాటుకుంది.
ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే ఢిల్లీ అధ్యక్షులు వెంకటేష్, ప్రధాన కార్యదర్శి తిరుపతి, కోశాధికారి శిరీష్ రెడ్డి, ఉపాధ్యక్షులు దూదిపాల విజయ్, రవీందర్ రెడ్డి కార్యదర్శులు కొన్నోజు రాజు, మేక గోపికృష్ణ, జబ్బర్ లాల్ నాయక్, నాగరాజు సభ్యులు సతీష్, రాజ్ కుమార్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రాజశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Also Read: తెలంగాణలో అధికార బీఆర్‌ఎస్ పార్టీకి తలనొప్పిగా మారిన ఆ మూడు స్థానాలు.. చల్లారని టికెట్ల రచ్చ!