Bandi Sanjay padayatra : యువకుడిపై బీజేపీ కార్యకర్తల దాడి..బండి సంజయ్ పాదయాత్రలో మరోసారి ఉద్రిక్తత..

బండి సంజయ్ పాదయాత్రలో మరోసారి ఉద్రిక్తత నెలకొంది. జనగామ జిల్లా కూనూరు శివారులో చాగంటి రాజు అనే యువకుడు బండి సంజయ్ ను ప్రశ్నలు వేస్తుండగా పాదయాత్రలో కొనసాగుతున్న బీజేపీ కార్యకర్తలు సదరు యువకుడిపై దాడి చేశారు. దీంతో పాదయాత్రలో ఉద్రిక్తత నెలకొంది.

Tension again in Bandi Sanjay padayatra.. : బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ నిర్వహిస్తున్న మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర పున:ప్రారంభమైంది. ఆయన యాత్రకు గురువారం (ఆగస్టు 25,2022) హైకోర్టు అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. కోర్టు అనుమతి తెచ్చుకున్న బండి తిరిగి తన పాదయాత్రను ఆగినచోటినుంచే తిరిగి ప్రారంభించారు. మూడు రోజుల క్రితం ఆగిన చోటు నుంచే.. బండి సంజయ్ పాదయాత్ర మళ్ళీ షురూ కావడం గమనార్హం.

ఈక్రమంలో బండి సంజయ్ పాదయాత్రలో మరోసారి ఉద్రిక్తత నెలకొంది. జనగామ జిల్లా కూనూరు శివారులో చాగంటి రాజు అనే యువకుడు బండి సంజయ్ ను ప్రశ్నలు వేస్తుండగా పాదయాత్రలో కొనసాగుతున్న బీజేపీ కార్యకర్తలు సదరు యువకుడిపై దాడి చేశారు. కాగా ఇటీవలే చాగంటి రాజు బీజేపీని వదలి టీఆర్ఎస్ పార్టీలో చేరాడు. ఈక్రమంలో బండి సంజయ్ పాదయాత్రకు వచ్చి ఆయన్ని ప్రశ్నించేందుకు యత్నించాడు.దీంతో బీజేపీ కార్యకర్తలు చాగంటి రాజుపై పిడిగుద్దులు కురిపించారు. అంతలోనే బీజేపీ నేతలు కార్యకర్తలను సముదాయించి పాద్రయాత్రను కొనసాగిస్తూ ముందుకు కదిలారు. దీంతో ఆ ప్రాంతంలో కాసేపు ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు కల్పించుకుని కార్యకర్తలను చెదరగొట్టి పాదయాత్ర ముందుకు కదిలేలా చర్యలు తీసుకున్నారు.

Bandi Sanjay Padayatra: 3 రోజుల క్రితం ఆగిన చోటు నుంచే.. బండి సంజయ్ పాదయాత్ర మళ్ళీ షురూ

బండి సంజయ్ నిర్వహిస్తున్న మూడో విడత ప్రజా సంగ్రామ యాత్రకు హైకోర్టు అనుమతి ఇవ్వటంతో పున:ప్రారంభమైంది. వరంగల్ పోలీసులు ఇచ్చిన నోటీసులను న్యాయస్థానం సస్పెండ్ చేసింది. దీంతో బండి సంజయ్ పాదయాత్రను మళ్ళీ ప్రారంభించారు. మూడు రోజుల క్రితం ఆగిన చోటు నుంచే.. బండి సంజయ్ పాదయాత్ర మళ్ళీ ప్రారంభించారు.

బండి సంజయ్ రోజుకు 20 కిలో మీటర్లకు పైగా నడవనున్నారు. స్టేషన్ ఘన్‌పూర్ నియోజక వర్గం పాంనూర్ నుంచి బండి సంజయ్ పాదయాత్ర చేస్తున్నారు. జనగామా జిల్లాలోని జఫర్ గఢ్ మండలం ఉప్పుగల్లు, కునూరు గ్రామాల్లో ఈ యాత్ర జరగనుంది. హనుమ కొండ జిల్లా ఐనవోలు మండలం గరిమెళ్ళపల్లి, నాగారం మీదుగా ఆయన పాదయాత్ర కొనసాగనుంది.

 

 

ట్రెండింగ్ వార్తలు