Bandi Sanjay Padayatra: 3 రోజుల క్రితం ఆగిన చోటు నుంచే.. బండి సంజయ్ పాదయాత్ర మళ్ళీ షురూ 

బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ నిర్వహిస్తున్న మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర పున:ప్రారంభమైంది. ఆయన యాత్రకు నిన్న హైకోర్టు అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. వరంగల్ పోలీసులు ఇచ్చిన నోటీసులను న్యాయస్థానం సస్పెండ్ చేసింది. దీంతో బండి సంజయ్ పాదయాత్రను మళ్ళీ ప్రారంభించారు. మూడు రోజుల క్రితం ఆగిన చోటు నుంచే.. బండి సంజయ్ పాదయాత్ర మళ్ళీ షురూ కావడం గమనార్హం.

Bandi Sanjay Padayatra: 3 రోజుల క్రితం ఆగిన చోటు నుంచే.. బండి సంజయ్ పాదయాత్ర మళ్ళీ షురూ 

Bandi Sanjay Padayatra

Bandi Sanjay Padayatra: బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ నిర్వహిస్తున్న మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర పున:ప్రారంభమైంది. ఆయన యాత్రకు నిన్న హైకోర్టు అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. వరంగల్ పోలీసులు ఇచ్చిన నోటీసులను న్యాయస్థానం సస్పెండ్ చేసింది. దీంతో బండి సంజయ్ పాదయాత్రను మళ్ళీ ప్రారంభించారు. మూడు రోజుల క్రితం ఆగిన చోటు నుంచే.. బండి సంజయ్ పాదయాత్ర మళ్ళీ షురూ కావడం గమనార్హం.

బండి సంజయ్ రోజుకు 20 కిలో మీటర్లకు పైగా నడవనున్నారు. స్టేషన్ ఘన్‌పూర్ నియోజక వర్గం పాంనూర్ నుంచి బండి సంజయ్ పాదయాత్ర చేస్తున్నారు. జనగామా జిల్లాలోని జఫర్ గఢ్ మండలం ఉప్పుగల్లు, కునూరు గ్రామాల్లో ఈ యాత్ర జరగనుంది. హనుమ కొండ జిల్లా ఐనవోలు మండలం గరిమెళ్ళపల్లి, నాగారం మీదుగా ఆయన పాదయాత్ర కొనసాగనుంది.

కాగా, ఇటీవల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో జనగామా జిల్లాలో బండి సంజయ్‌ పాదయాత్ర నిలిపివేయాలని అక్కడి పోలీసులు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. వర్దన్నపేట ఏసీపీ ఇచ్చిన ఆ నోటీసులను నిన్న హైకోర్టు సస్పెండ్ చేసింది. మరోవైపు, రేపు వరంగల్‌ భద్రకాళి మందిరం వద్ద తన పాదయాత్రను ముగించనున్నట్లు బండి సంజయ్‌ ఇప్పటికే ప్రకటన చేశారు. ఈ సందర్భంగా హనుమకొండ ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్స్ లో నిర్వహించనున్న సభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రానున్నట్లు ఆ పార్టీ ప్రకటించింది.

Viral video: కొడుకుని ఎత్తుకుని రిక్షా తొక్కుతున్న తండ్రి.. కన్నీరు పెట్టిస్తోన్న వీడియో