గతంలో సల్మాన్, సంజయ్ దత్ వంటి అనేక మంది కూడా అరెస్ట్ అయ్యారు: బన్నీ అరెస్టుపై రేవంత్‌ రెడ్డి

అల్లు అర్జున్ ను అరెస్ట్ చేస్తే అడుగుతున్నారని, చనిపోయిన మహిళ, ఆమె కుమారుడి గురించి అడగడం ఎవరూ లేదని చెప్పారు.

CM Revanth Reddy, Allu Arjun

అల్లు అర్జున్ అరెస్టుపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి మరోసారి స్పందించారు. ఆజ్ తక్ సదస్సులో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. దేశంలో గతంలో సల్మాన్ ఖాన్, సంజయ్ దత్ వంటి అనేక మంది కూడా అరెస్ట్ అయ్యారని తెలిపారు.

సినిమా విడుదల వేళ రూ.300 టికెట్ ను రూ.1300 చేసి బెనిఫిట్ షో చేశారని చెప్పారు. బెనిఫిట్ షో తొక్కిసలాటలో ఒక మహిళ చనిపోయారని గుర్తు చేశారు. సినిమా హాల్ వాళ్లను అరెస్ట్ చేశారని, 10 రోజుల తరువాత అల్లు అర్జున్ ను అరెస్ట్ చేశారని అన్నారు.

సెలబ్రిటీ అయినంత మాత్రాన చట్టానికి అతీతులు కాదని, కార్ పైకి ఎక్కి ప్రేక్షకులను ఉత్తేజపరిచారని అన్నారు. పరిస్థితి చేదాటి పోయిందని చెప్పారు. అల్లు అర్జున్ ను ఏ11గా చేర్చామని, చనిపోయిన మహిళ బాధ్యత ఎవరు తీసుకుంటారని అన్నారు. ఆమె కొడుకు ఆసుపత్రిలో ఉన్నాడని చెప్పారు. సినిమాను హోం థియేటర్ లో చూడొచ్చని లేదా ముందస్తుగా పోలీసులకు సమాచారం ఇచ్చి చూడొచ్చని తెలిపారు.

ముందస్తు సమాచారం ఇవ్వకుండా వెళ్లడం వల్ల ఈ పరిస్థితి తలెత్తిందని చెప్పారు. అల్లు అర్జున్ తనకు చిన్నప్పటి నుంచి తెలుసని అన్నారు. అల్లు అర్జున్ ను అరెస్ట్ చేస్తే అడుగుతున్నారని, చనిపోయిన మహిళ, ఆమె కుమారుడి గురించి ఎవరూ అడగడం లేదని చెప్పారు. సినిమావాళ్లు డబ్బులు పెట్టారు.. డబ్బులు సంపాదించారని తెలిపారు.

Professor Nageshwar : అల్లు అర్జున్ ఏమీ తీవ్రవాది కాదు..! అరెస్ట్ వ్యవహారంపై ప్రొ.నాగేశ్వర్ కీలక వ్యాఖ్యలు