Patnam Narender Reddy: పట్నం నరేందర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై తీర్పును రిజర్వ్ చేసిన హైకోర్టు
ఆయన వేసిన క్వాష్ పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు ముగిశాయి.

Patnam Narender Reddy
బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం మహేందర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. వికారాబాద్ జిల్లా లగచర్లలో కలెక్టర్‌పై దాడి కేసులో పట్నం నరేందర్ రెడ్డి అరెస్టయిన విషయం తెలిసిందే.
ఆయన వేసిన క్వాష్ పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు ముగిశాయి. ఆయనను అరెస్టు చేసిన విధానాన్ని హైకోర్టు తప్పుబట్టింది. నరేంద్రర్ రెడ్డి పాత్రపై నమోదు చేసిన వాంగ్మూలాలు ఇవ్వాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది.
వాకింగ్‌కు వెళ్లిన ఆయనను ఆ రీతిలో ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చిందని అడిగింది. నరేందర్ రెడ్డి తరపున గండ్ర మోహన్ రావు వాదనలు వినిపించారు. నరేందర్ రెడ్డిని అరెస్టు చేసిన సమయంలో పోలీసులు కనీస నిబంధనలను పాటించలేదని పిటిషనర్ తరఫు న్యాయవాది అన్నారు.
నరేందర్ రెడ్డిది అక్రమ అరెస్ట్ అని లాయర్ వాదించారు. ఎక్కడ కూడా పోలీసులు లీగల్ ప్రొసీడింగ్స్ ఫాలో కాలేదని చెప్పారు. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా మాజీ ఎమ్మెల్యేను అరెస్ట్ చేశారని అన్నారు.
CM Revanth Reddy: శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో రేవంత్ రెడ్డి ప్రత్యేక పూజలు