CM Revanth Reddy: శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో రేవంత్ రెడ్డి ప్రత్యేక పూజలు
ఆలయంలో ధ్వజస్తంభం వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోడె మొక్కులు చెల్లించుకున్నారు.

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ ఉదయం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ఆవరణలో ధర్మగుండం వద్ద 76 కోట్లతో చేపట్టే ఆలయ అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంకకుస్థాపన చేశారు.
వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం స్థల పురాణాన్ని పురోహితులు వివరించారు. అనంతరం దేవాలయ అభివృద్ధి పనుల వివరాలను అధికారులు వివరించారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పూర్ణకుంభంతో ఆలయ అర్చకులు ఘన స్వాగతం పలికారు.
ఆలయంలో ధ్వజస్తంభం వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోడె మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయం లోని శ్రీ లక్ష్మీ గణపతి స్వామి , రాజరాజేశ్వరి అమ్మవారు వద్ద అర్చన, శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి అభిషేకం వంటి ప్రత్యేక పూజలను ముఖ్యమంత్రి నిర్వహించారు. పూజల అనంతరం ముఖ్యమంత్రి, మంత్రి వర్యులకు ఆలయ పండితులు వేద ఆశీర్వచనం అందజేశారు.
Errabelli Dayakar Rao: నాపై రేవంత్ అనుచిత వ్యాఖ్యలు చేశారు: ఎర్రబెల్లి