×
Ad

TG Inter Exams : ఇంటర్‌ విద్యార్థులకు బిగ్ అలర్ట్.. పరీక్షల షెడ్యూల్‌లో స్వల్ప మార్పు

TG Inter Exams : తెలంగాణ ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్‌లో ఇంటర్‌ బోర్డు స్వల్ప మార్పులు చేసింది. మార్చి 3న జరగాల్సిన

TG Inter Exams

TG Inter Exams : తెలంగాణలోని ఇంటర్ విద్యార్థులకు అలర్ట్. ఇంటర్మీడియట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటర్‌ పరీక్షల (TG Inter Exams) షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు చేసింది.

ఇటీవల ఇంటర్ బోర్డు ఇంటర్ మొదటి సంవత్సరం, రెండో సంవత్సరం పరీక్షలకు సంబంధించి షెడ్యూల్ నేు విడుదల చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆ షెడ్యూల్ కు సంబంధించిన స్వల్ప మార్పులు చేసింది.

మార్చి 3న జరగాల్సిన ఇంటర్‌ సెకండియర్‌ మ్యాథ్స్‌ 2ఏ, బోటనీ, పొలిటికల్‌ సైన్స్‌ పరీక్షలను మార్చి 4న నిర్వహించనున్నట్లు తెలిపింది. మార్చి 3న హోలీ ఉండటంతో పరీక్షల తేదీలో మార్పు చేసినట్లు వెల్లడించింది. మిగతా పరీక్షలు యథాతథంగా నిర్వహించనున్నట్లు ఇంటర్ బోర్డు పేర్కొంది.

ఇంటర్మీడియట్ మొదటి, ద్వితీయ సంవత్సరాలకు సంబంధించిన పరీక్షల షెడ్యూల్ ను ఇటీవల తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇంటర్ రాత పరీక్షలు ఫిబ్రవరి 25న ప్రారంభమై మార్చి 18వ తేదీ వరకు జరగనున్నాయి. రోజుకు రెండు సెషన్ల చొప్పున ఈ పరీక్షలు జరుగుతాయి. ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సెషన్, మధ్యాహ్నం 2గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు రెండో సెషన్ పరీక్షలు జరుగుతాయి.

రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ కలిపి సుమారు 9.50 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఫస్టియర్, సెకండియర్ విద్యార్థులకు రోజు మార్చి రోజు పరీక్షలు ఉంటాయి. ఇక ఫిబ్రవరి 2 నుంచి 21వ తేదీ వరకు ప్రాక్టికల్స్ ఎలాంటి మార్పులు లేవు. యథాతథంగా జరగనున్నాయి.

Also Read : AP TDP : జిల్లాల వారీగా టీడీపీ నూతన అధ్యక్షులు వీరే..? వారికి అధిక ప్రాధాన్యత