రంగారెడ్డి జిల్లాలోని చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్‌పై దాడి జరిగిన ఘటనపై తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబు స్పందించారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన చేశారు. రామ రాజ్యం పేరుతో దాడులు చేసే వారిని ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని స్పష్టం చేశారు.
రామరాజ్యం పేరుతో చిలుకూరి బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకుడు రంగరాజన్‌పై దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని శ్రీధర్ బాబు తెలిపారు. ఇది హేయమైన చర్య అని, రామరాజ్యం పేరుతో రౌడీయిజం చేస్తూ అరాచకాలకు పాల్పడుతున్న వారిని ఉపేక్షించేది లేదని చెప్పారు.
Also Read: సారీ.. రామ్ చరణ్ ని ఉద్దేశపూర్వకంగా అనలేదు.. ఇది ఇక్కడితో వదిలేయండి: అల్లు అరవింద్
రాముడి పేరును బద్నామ్ చేస్తూ అరాచక అనాగరిక కార్యక్రమాలకు పాలపడడం దుర్మార్గమని శ్రీధర్ బాబు అన్నారు. వారు చేసే ఆగడాలకు రాముడి పేరును వాడుకుంటు రామరాజ్యం అని చెప్పడం క్షమించని నేరమని చెప్పారు.
రాముడి భక్తుల మనోభావాలను దెబ్బ తీసే చర్య అని శ్రీధర్ బాబు అన్నారు. కొందరు ప్రజలలో ఉన్న హిందుత్వ భావాన్ని ఈ విధంగా దుర్వినియోగం చేస్తున్నారని చెప్పారు. ఇలాంటి వారి పట్ల పోలీసులు ప్రజలు రాజకీయ పార్టీలు అందరూ అప్రమతంగా ఉండాలని అన్నారు.
ఇటువంటి దుర్మార్గపు చర్యలు, అరాచక శక్తుల పట్ల ప్రభుత్వం చాలా కఠినంగా వ్యవహరిస్తుందని శ్రీధర్ బాబు చెప్పారు. ధర్మాన్ని కాపాడుతూ సమాజహితం కోసం నిస్వార్థంగా పని చేస్తున్న అర్చకుల పట్ల ఇలాంటి దాడులు అమానుషమని తెలిపారు. ప్రభుత్వం ఇలాంటి దాడులను ఉపేక్షించదు.. కఠినంగా వ్యవహరిస్తామని అన్నారు.