సారీ.. రామ్ చరణ్ ని ఉద్దేశపూర్వకంగా అనలేదు.. ఇది ఇక్కడితో వదిలేయండి: అల్లు అరవింద్
తాను అలా ఉద్దేశపూర్వకంగా అనలేదని అల్లు అరవింద్ అన్నారు.

సామాజిక మాధ్యమాల్లో తనపై వస్తున్న ట్రోలింగ్ పట్ల సినీ నిర్మాత అల్లు అరవింద్ కీలక వ్యాఖ్యలు చేశారు. రామ్ చరణ్‌ను తగ్గించానని తనను బాగా ట్రోల్ చేశారని, అయితే, తాను ఉద్దేశపూర్వకంగా అలా అనలేదని అన్నారు.
మెగా అభిమానులు తనను ట్రోల్ చేశారని తెలిపారు. రామ్ చరణ్, తాను మంచి రిలేషన్‌లోనే ఉంటామని చెప్పారు. ఈ మధ్య తండేల్ ఈవెంట్లో రామ్ చరణ్ స్థాయిని తాను తగ్గించానంటూ ట్రోల్ చేస్తున్నారని తెలిపారు.
Also Read: సారీ సార్.. అంటూ హీరో విశ్వక్ సేన్ ఆవేదనాభరిత కామెంట్స్.. దయచేసి బలి చేయొద్దంటూ..
కానీ, తాను దిల్ రాజుకి పరిస్థితిని చెప్పే క్రమంలో ఉద్దేశపూర్వకంగా కాకుండా అలా మాట్లాడానని చెప్పారు. దానికే కొందరు మెగా అభిమానులు ఫీలయి ట్రోల్ చేశారని తెలిపారు.
చరణ్ తనకు ఏకైక మేనల్లుడని, అలాగే, చరణ్‌కు తాను ఏకైక మేనమామనని చెప్పారు. ఇక్కడితో ఆ విషయాన్ని వదిలేయండని కోరారు. ఉద్దేశపూర్వకంగా తాను అనలేదని అన్నారు. ఎవరైనా ఫీలయితే సారీ అని చెప్పారు.
కాగా, గతంలో తండేల్ మూవీ ఈవెంట్లో తాను మాట్లాడుతున్న సమయంలో చెర్రీ సినిమాను, ఆయనను తక్కువ చేసి వ్యాఖ్యలు చేసినట్లు ఓ విలేకరి ప్రస్తావించారని అల్లు అరవింద్ గుర్తు చేశారు.
దాని గురించే ఇప్పుడు తాను స్పందిస్తున్నానని తెలిపారు. తండేల్ ఈవెంట్‌లో స్పందించడం కరెక్ట్ కాదని, అప్పుడు నో కామెంట్స్ అని చెప్పానని అన్నారు. రామ్ చరణ్ తనకు కుమారుడిలాంటివాడని తెలిపారు.