శ్రీశైలం ఎడమగట్టు కాలువ (ఎస్ఎల్‌బీసీ) ప్రాజెక్టు వద్ద హైడ్రామా నెలకొంది. అక్కడకు వెళ్లిన బీఆర్ఎస్ నేతలు హరీశ్‌రావు, జగదీశ్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, తదితరులను పోలీసులు అడ్డుకున్నారు. టన్నెల్ వద్ద సహాయ కార్యక్రమాలు జరుగుతున్న విషయం తెలిసిందే.
అక్కడి పరిస్థితిని చూసేందుకు వెళ్తున్న బీఆర్‌ఎస్ నేతలను చెక్‌పోస్ట్ వద్ద పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. హరీశ్ రావు అక్కడే రోడ్డుపైనే బైఠాయించారు. సొరంగం వద్దకు వెళ్లకూడదని బీఆర్‌ఎస్ నేతలకు పోలీసులు చెప్పారు. వారి తీరుపై హరీశ్‌రావు అసహనం వ్యక్తం చేశారు. అక్కడ పోలీసులు మోహరించారు.
కాగా, టన్నెల్‌లో చిక్కుకున్న ఎనిమిది మంది కార్మికుల పరిస్థితిపై తీవ్ర ఆందోళన నెలకొంది. ఇప్పటికే టన్నెల్‌లో పెద్ద ఎత్తున మట్టి కూలడంతో పాటు నీరు, బురద చేరింది. దీంతో కార్మికులు ప్రాణాలతో ఉన్నారా? అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. కార్మికులు బురదలో టన్నెల్ బోరింగ్ మెషీన్ వద్ద కూరుకుపోయి ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
నాగర్ కర్నూలు జిల్లాలో ఇవాళ ఉదయం హరీశ్ రావు మాట్లాడుతూ.. “సహాయక చర్యలను పరిశీలించడానికి ఇక్కడికి వచ్చాం. రిస్క్యూ ఆపరేషన్ జరుగుతుంది ఇబ్బందులు కావద్దని ఉద్దేశంతో ఆగి వెళ్తున్నాం. హెలికాప్టర్లో వస్తున్నారు హెలికాప్టర్లో పోతున్నారు. సమన్వయం చేయలేకపోతున్నారు. ఆరు రోజులైనా స్పష్టత ఇవ్వడం లేదు. ఏం జరుగుతుంది?
బాధితుల కుటుంబాలని పరామర్శించడానికి వచ్చాం. వారికి ధైర్యం చెప్పడంతో పాటు సహాయక చర్యలు ఏం తీసుకుంటారో చూడ్డానికి సూచనలు చేయడానికి వచ్చాము. నాతో వచ్చిన లీడర్లను కూడా అడ్డుకున్నారు. ఎమ్మెల్సీలను లోపలికి అలో చేయలేదు. వాళ్లంతా ఇక్కడే ఉన్నారు. మాలో ఎనిమిది పది మందిని లోపలికి పంపిస్తామని అన్నారు.
ఒక కారు పోవాలి అని మమ్మల్ని ఆపారు. మేము వస్తున్నామని మీడియాను కూడా బయటకు గెంటేశారు. బాధతో ఉన్న బాధిత కుటుంబ సభ్యులను కలవనివ్వకుండా వారి కుటుంబ సభ్యులను కూడా ఇక్కడి నుంచి తరలించి దాచి పెట్టారు. ఎందుకంత భయం. ప్రధాన ప్రతిపక్షం వస్తే బాధ్యతగా ఉండాలి. సూచనలు చేయడానికి ప్రభుత్వం దగ్గరకు వచ్చాం. ఎందుకు బాధ? కుటుంబాలను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు” అని అన్నారు.
ఎస్ఎల్బిసి వద్దకు వెళ్లేందుకు పోలీసులు అనుమతించకపోవడంతో మాజీ మంత్రి @BRSHarish, BRS నాయకుల నిరసన. pic.twitter.com/hFh1Ez30mK
— Office of Harish Rao (@HarishRaoOffice) February 27, 2025