MS Dhoni: ఐపీఎల్ ముందు షాక్.. అధికారికంగా రిటైర్‌మెంట్ ప్రకటించనున్న ఎమ్మెస్ ధోనీ? అతడి షర్ట్‌పై ఉన్న కోడ్‌కి అర్థం ఇదే..
ధోనీ ఐపీఎల్ కోసం సన్నద్ధం కావడానికి చెన్నై చేరుకున్నాడు.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 ప్రారంభం కావడానికి మరో నెల రోజుల సమయం కూడా లేదు. ఈ సమయంలో భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఐపీఎల్ నుంచి రిటైర్ అవుతారని మరోసారి ప్రచారం జరుగుతోంది. అయితే, ఇంతకు ముందు ఏ ఆధారాలు లేకుండా ఆ ప్రచారం జరిగితే, ఈసారి మాత్రం ఓ ఆధారాన్ని పట్టుకుని మరీ అతడి రిటైర్‌మెంట్ అంటూ ప్రచారం చేస్తున్నారు.
ధోనీ ఐపీఎల్ కోసం సన్నద్ధం కావడానికి చెన్నై చేరుకున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ ప్రతి ఏడాదిలాగే ఇప్పుడు కూడా తమ మ్యాచ్‌కు నెల రోజుల ముందు చెపాక్‌లో ఒక క్యాంప్‌ను నిర్వహించింది. ఈ ఐపీఎల్ సీజన్‌లో ముంబై ఇండియన్స్‌తో చెన్నై సూపర్ కింగ్స్ మార్చి 23న తొలి మ్యాచ్ ఆడనుంది.
ఈ సందర్భంగా చెన్నైకి ధోనీ రావడంతో అతడి వీడియో, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అతని టీ-షర్టుపై ఓ కోడెడ్ మెసేజ్ ఉందని అభిమానులు గుర్తించారు. ఇది మోర్స్ కోడ్‌లో రాసి ఉంది. ఇది ఓ టెలికమ్యూనికేషన్ పద్ధతిలో వరుసగా చుక్కలతో కూడి డాష్‌లతో ఉంటుంది.
ధోనీ షర్టుపై ఉన్న ఆ కోడ్‌కి అర్థం “వన్ లాస్ట్ టైమ్”. అతడు ఇలా “ఇదే చివరిసారి” అని రాసి ఉన్న షర్టుని ఎందుకు వేసుకువచ్చాడని ఫ్యాన్స్ తికమకపడుతున్నారు. ఇక అఫిషియల్‌గా రిటైర్‌మెంట్ అంటూ ప్రకటన చేయనున్నాడంటూ సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతోంది.
కాగా, గత వారం ధోనీ ఓ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ.. క్రికెట్‌లో కొనసాగడానికి తనకు ఎంత సమయం ఉన్నా ఆ సమయాన్ని ఓ పిల్లాడిలా ఎంజాయ్ చేస్తానని చెప్పాడు. ధోనీ రిటైర్ అవుతాడన్న వార్తలు ప్రతి ఐపీఎల్ సీజన్ సమయంలోనూ వస్తుంటాయి. ఈ సారి అతడి షర్టుపై ఉన్న కోడ్ ద్వారా నిజంగానే క్లూ ఇచ్చేశాడని ఫ్యాన్స్ అంటున్నారు.
The morse code on Thala’s t-shirt says “ONE LAST TIME” 😭@ChennaiIPL
Noooooo😭😭#CSK #IPL #MSD #Dhoni pic.twitter.com/OwnzUszagq— BlackGold✨ (@b1ackgoldd) February 26, 2025