Champions Trophy 2025: “నాకు కోచ్‌గా ఛాన్స్‌ ఇస్తే పాకిస్థాన్‌ క్రికెట్‌ని పీక్‌కి తీసుకెళ్తా” అంటున్న ఇండియన్ ప్లేయర్ ఫాదర్

భారత మాజీ క్రికెటర్లు తమ సొంత జట్టుపై ఇలాంటి విమర్శలు చేయడాన్ని మీరు ఎప్పుడైనా చూశారా అని పాక్‌ మాజీ ప్లేయర్లను యోగ్‌రాజ్‌ ప్రశ్నించారు.

Champions Trophy 2025: “నాకు కోచ్‌గా ఛాన్స్‌ ఇస్తే పాకిస్థాన్‌ క్రికెట్‌ని పీక్‌కి తీసుకెళ్తా” అంటున్న ఇండియన్ ప్లేయర్ ఫాదర్

Yograj Singh

Updated On : February 27, 2025 / 3:56 PM IST

పాకిస్థాన్‌ క్రికెట్‌ టీమ్‌కి కోచ్‌గా తనకు ఛాన్స్‌ ఇస్తే ఆ జట్టుని పీక్‌కి తీసుకెళ్తానని ఓ ఇండియన్ ప్లేయర్ ఫాదర్ అంటున్నారు. భారత మాజీ క్రికెటర్, యువరాజ్ సింగ్ తండ్రి యోగ్‌రాజ్ సింగ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు.

పాకిస్థాన్ మాజీ ప్లేయర్లు వసీమ్ అక్రమ్, షోయబ్ అఖ్తర్ వంటివారిపై యోగ్‌రాజ్ సింగ్ తీవ్ర విమర్శలు చేశారు. పాకిస్థాన్‌ జట్టుపై వసీమ్ అక్రమ్, షోయబ్ అఖ్తర్ చేసిన విమర్శలు సరికాదని అన్నారు.

ఛాంపియన్స్‌ ట్రోఫీ 2025లో పాకిస్థాన్ క్రికెట్ టీమ్ పేలవ ప్రదర్శన కనబర్చి ఈ టోర్నమెంట్‌ నుంచి నిష్క్రమించే స్థితికి వచ్చిన విషయం తెలిసిందే. దీనిపై పాక్ మాజీ క్రికెటర్లు చేసిన వ్యాఖ్యలపై యోగ్‌రాజ్ సింగ్ స్పందిస్తూ.. వసీమ్ అక్రమ్ మంచి పేరున్న మాజీ క్రికెటర్ అని, అటువంటి వ్యక్తి అలాంటి అవమానకరమైన వ్యాఖ్యలు చేయడం ఏంటని ప్రశ్నించారు.

ఆ సమయంలో ఆయన చుట్టూ ఉన్నవారు నవ్వడం ఏంటని, వారు సిగ్గుపడాలని యోగ్‌రాజ్‌ చెప్పారు. అలాగే, షోయబ్ అఖ్తర్.. పాకిస్థాన్ ఆటగాళ్లను రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీతో పోల్చడం ఏంటని అన్నారు. షోయబ్ అఖ్తర్ స్టూడియోలో కూర్చునే బదుల సొంత దేశానికి తిరిగి వెళ్లి యువ క్రికెటర్లకు శిక్షణ ఇవ్వాలని యోగ్‌ రాజ్‌ సూచించారు.

Recruitment 2025: బ్యాంకులో ఉద్యోగాలు.. ఉద్యోగం వస్తే వార్షిక ఆదాయం రూ.6,14,000

పాకిస్థాన్‌ ప్రపంచ కప్‌ సాధించేలా చేయాలని యోగ్‌రాజ్‌ సవాలు విసిరారు. ఈ పని చేయలేకపోతే ఇక విమర్శలకు దూరంగా ఉండడని అన్నారు. పాకిస్థాన్‌ టీమ్‌కి మంచి మెంటర్‌షిప్‌ ఉండాలని చెప్పారు. పాకిస్థాన్‌కు టాలెంట్ చాలా ఉందని అన్నారు.

పాక్‌ ఆటగాళ్లకు మార్గదర్శకత్వం అవసరమని యోగ్‌రాజ్‌ చెప్పారు. వసీమ్, షోయబ్ వంటి వారు ప్రపంచ స్థాయి క్రికెటర్లుగా మారడానికి అప్పట్లో వారికి మంచి మెంటర్‌షిప్‌ దక్కిందని, మరి ఈ మాజీ క్రికెటర్లు ఇప్పుడు తరువాతి తరానికి ఎందుకు సాయం చేయట్లేదని విమర్శించారు.

తాను పాక్‌కి వెళితే, ఒక సంవత్సరంలోనే జట్టును మెరుగుపరుస్తానని యోగ్‌రాజ్‌ అన్నారు. ట్రైనింగ్‌ అనేది ఓ ప్యాషన్ అని, సమయాన్ని ఆటగాళ్లకు అంకితం చేయడమని చెప్పారు. తాను రోజుకు 12 గంటల శిక్షణ ఇస్తానని, ఇటువంటి నిబద్ధత కావాలని అన్నారు.

భారత మాజీ క్రికెటర్లు తమ సొంత జట్టుపై ఇలాంటి విమర్శలు చేయడాన్ని మీరు ఎప్పుడైనా చూశారా అని పాక్‌ మాజీ ప్లేయర్లను యోగ్‌రాజ్‌ ప్రశ్నించారు. ఇటువంటి విమర్శలు వారు చేయరని, ఎందుకంటే ఇది ఆటగాళ్ల విశ్వాసాన్ని దెబ్బతీస్తుందని అన్నారు.

పాక్‌ ఆటగాళ్లు ఇప్పటికే సమస్యలు ఎదుర్కొంటున్నారని, ఇప్పుడు మాజీ క్రికెటర్ల నుంచి అలాంటి విమర్శలు వింటుంటే వారు మరింత దిగజారిపోతారని చెప్పారు. మాజీ ప్లేయర్లు పాకిస్థాన్ క్రికెట్ గురించి నిజంగా శ్రద్ధ వహిస్తే.. వారు ఇటువంటి వ్యాఖ్యలు చేయొద్దని, యువతకు సూచనలు చేయాలని అన్నారు.