car washed away in river
Car Washed Away In River : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత కొన్ని రోజులుగా వానలు కురుస్తున్నాయి. ఉమ్మడి మహబూబ్‌నగర్, వికారాబాద్ జిల్లాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. వికారాబాద్ జిల్లా ధారూరు మండల పరిధిలోని నాగారం గ్రామ సమీపం వద్ద దోర్నాల గ్రామానికి చెందిన దంపతులు ప్రయాణిస్తున్న కారు వాగులో చిక్కుకుంది.
ప్రవాహానికి కొద్దిదూరం వరకు కొట్టుకుపోయింది. డ్రైవర్ వాగు ప్రవాహాన్ని గమనించకుండా ముందుకు తీసుకెళ్లడంతో ప్రవాహానికి కారు కొట్టుకుపోయి గట్టు వద్ద ఉన్న చెట్టు అడ్డురావడంతో వారు ప్రాణాలతో బయట పడ్డారు.
Nellore Lorry Hits Auto : నెల్లూరు జిల్లాలో ఘోర ప్రమాదం.. వాగులో పడిన ఆటో.. ప్రయాణికుల కోసం గాలింపు
కారు నీటిలో మునిగిపోగా భార్యభర్తలు కారు నుంచి బయటకు వచ్చి ఎత్తైన కొమ్మల సహాయంతో చెట్టుపైకి ఎక్కి ప్రాణాలు కాపాడుకున్నారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతుండడంతో రాకపోకలు నిలిచిపోయాయి.
10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.