Nellore Lorry Hits Auto : నెల్లూరు జిల్లాలో ఘోర ప్రమాదం.. వాగులో పడిన ఆటో.. ప్రయాణికుల కోసం గాలింపు

నెల్లూరు జిల్లాలో ఘోరం జరిగింది. సంగం దగ్గర ఓ లారీ.. ఆటోని ఢీకొట్టింది. లారీ వేగంగా ఢీకొట్టడంతో ఆటో బీరపేరు వాగులో పడిపోయింది. ఆటోలో ఉన్న వారంతా వాగులో పడిపోయారు.

Nellore Lorry Hits Auto : నెల్లూరు జిల్లాలో ఘోర ప్రమాదం.. వాగులో పడిన ఆటో.. ప్రయాణికుల కోసం గాలింపు

Sangam Auto Accident

Nellore Lorry Hits Auto : నెల్లూరు జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. సంగం దగ్గర ఓ లారీ.. ఆటోని ఢీకొట్టింది. లారీ వేగంగా ఢీకొట్టడంతో ఆటో బీరాపేరు వాగులో పడిపోయింది. ఆటోలో ఉన్న వారంతా వాగులో పడిపోయారు. ప్రమాద సమయంలో ఆటోలో 12మంది ఉన్నారు.

SBI CBO Recruitment 2021 : ఎస్బీఐలో ఉద్యోగాలు.. 1226 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

ఆటోలో ఉన్న వారు వాగు ఉధృతికి కొట్టుకుపోయారు. వెంటనే స్పందించిన స్థానికులు వాగులో కొట్టుకుపోతున్న వారిని కాపాడేందుకు ప్రయత్నాలు చేపట్టారు. పోలీసులు, స్థానికులు ఆరుగురిని కాపాడారు. ఓ చిన్నారి చనిపోయింది. ఆటో ఆత్మకూరు నుంచి సంగం వెళ్తుండగా ఈ దారుణం జరిగింది. ఆటోలోని వారంతా ఒకే కుటుంబానికి చెందిన వారిగా తెలుస్తోంది. వాగులో కొట్టుకుపోయిన మిగతా వారి కోసం గాలింపు చేపట్టారు.