Secunderabad cantonment
Secunderabad Cantonment Board : కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలు సహా దేశంలోని 57 కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలను రద్దు చేసింది. ఈ ఏడాది ఏప్రిల్ 30న జరగాల్సిన కంటోన్మెంట్ ఎన్నికలను రద్దు చేసింది. ఈ మేరకు శుక్రవారం (మార్చి17,2023) కేంద్ర రక్షణ శాఖ గెజిట్ విడుదల చేసింది.
ఫిబ్రవరి17న విడుదల చేసిన గెజిట్ ను కేంద్రం రద్దు చేసింది. కేంద్రం నిర్ణయంతో దేశంలోని 57 కంటోన్మెంట్ బోర్డులలో ఎన్నికలు రద్దు అయ్యాయి. 2015లో సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలు జరిగాయి. ఆ ఏడాది ఫిబ్రవరి 10న పాలకవర్గం కొలువుదీరింది.
2020 ఫిబ్రవరి 10వ తేదీ నాటికి పాలకవర్గం గడువు ముగిసింది. అనంతరం కేంద్ర ప్రభుత్వం నామినేటెడ్ సభ్యుడిని నియమించింది. తాజాగా కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో దేశ వ్యాప్తంగా ఉన్న 57 కంటోన్మెంట్ బోర్డుల్లో ఎన్నికలు రద్దు అయ్యాయి.