Cantonment-GHMC : జీహెచ్ఎంసీలో కంటోన్మెంట్ విలీనానికి కేంద్రం కీలక నిర్ణయం..8మంది సభ్యులతో కమిటీ ఏర్పాటు

జీహెచ్ఎంసీలో కంటోన్మెంట్ విలీనానికి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. సికింద్రాబాద్ లోని కంటోన్మెంట్ ను జీహెచ్ఎంసీలో విలీనం చేయటానికి విధివిధానాలను రూపొందించేందుకు కేంద్రం 8మంది సభ్యులతో ఓ కమిటీని నియమించింది. రక్షణశాఖ, తెలంగాణ మున్సిపల్ సెక్రటరీ సహా ఎనిమిది మంది సభ్యులు ఈ కమిటీలో ఉన్నారు.

Cantonment-GHMC : జీహెచ్ఎంసీలో కంటోన్మెంట్ విలీనానికి కేంద్రం కీలక నిర్ణయం..8మంది సభ్యులతో కమిటీ ఏర్పాటు

Cantonment Areas Merging in GHMC

Secunderabad Cantonment IN GHMC : జీహెచ్ఎంసీలో కంటోన్మెంట్ విలీనానికి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. సికింద్రాబాద్ లోని కంటోన్మెంట్ ను జీహెచ్ఎంసీలో విలీనం చేయటానికి విధివిధానాలను రూపొందించేందుకు కేంద్రం 8మంది సభ్యులతో ఓ కమిటీని నియమించింది. రక్షణశాఖ, తెలంగాణ మున్సిపల్ సెక్రటరీ సహా ఎనిమిది మంది సభ్యులు ఈ కమిటీలో ఉన్నారు. దీనికి సంబంధించి నివేదిక నెల రోజుల లోపులో కేంద్రానికి అందజేయాలని తెలంగాణ ప్రభుత్వాని కేంద్రం లేఖ రాసింది. కేంద్రం ఆదేశాలతో జీహెచ్ఎంసీలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతం విలీనంపై కసరత్తులు షురూ చేసింది కమిటీ. దీని కోసం ఈ కమిటీ కంటోన్మెంట్ ఏరియాలో పర్యటిస్తుంది. కాగా దేశంలో ఉన్న కంటోన్మెంట్లతో అతిపెద్దది సికింద్రాబాద్‌లోని కంటోన్మెంట్ కావటం విశేషం. అటువంటి కంటోన్మెంట్ ఏరియా ఇక జీహెచ్ ఎంసీలు విలీనం కానుంది.

సివిల్ ప్రాంతం, స్థిర, చర ఆస్తులు, ఉద్యోగుల బదలాయింపు సహా అన్ని అంశాలపై కమిటీ అధ్యయనం చేసి రిపోర్టు తయారు చేసి కేంద్రానికి అందజేయాల్సి ఉంటుంది. కంటోన్మెంట్ ప్రాంతాన్ని జీహెచ్ఎంసీలో విలీనానికి అభ్యంతరం లేదని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. బేగంపేట విమానాశ్రయం కారణంగా, ఆర్మీ ఆంక్షలతో కంటోన్మెంట్ పరిధిలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టటానికి వీల్లేకుండాపోయింది. ఎస్సీబీ వద్ద కూడా తగినన్ని నిధులు లేక.. రోడ్ల విస్తరణ, మౌలిక సదుపాయాలను కూడా కల్పించలేని పరిస్థితి ఉంది. ఇలా జీహెచ్ ఎంసీ పరిధిలోని ప్రాంతాలు అభివృద్ధి జరుగుతుంటే కంటోన్మెంట్ ప్రాంతం మాత్రం ఎటువంటి అభివృద్ధికి నోచుకుండా ఉండిపోవాల్సి వచ్చింది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో ఇక ఆ ప్రాంతంలోకూడా అభివృద్ధి జరిగే అవకాశాలున్నాయి.

కాగా దేశంలో ఉన్న కంటోన్మెంట్ బోర్డులను సమీపంలోని స్థానిక సంస్థల్లో విలీనం చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే అన్ని రాష్ట్రాలకు తమ అభిప్రాయం తెలియజేయాలని లేఖలద్వారా తెలియజేసింది కేంద్రం. మధ్యప్రదేశ్‌లోని కంటోన్మెంట్ ప్రాంతం ఇప్పటికే ఈ ప్రాంతానికి దగ్గరలో ఉన్న మున్సిపాలిటీలో కలిసిపోయింది. ఈక్రమంలో ఇక తెలంగాణలోని సికింద్రాబాద్ ప్రాంతంలోఉన్న కంటోన్మెంట్ కూడా ఇక జీహెచ్ఎంసీలో కలవనుంది కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో.

తెలంగాణ ప్రభుత్వం కూడా ఎస్సీబీని తమ ఆధీనంలోకి తీసుకోవడానికి అంగీకరించింది. దీనికి తమకు ఎటువంటి అభ్యంతరం లేదని తెలిపింది. ఈ క్రమంలో ఈ కమిటీని ఏర్పాటు చేసింది కేంద్రం. కంటోన్మెంట్ ప్రాంతం అంతా ఇక జీహెచ్ఎంసీలో విలీనం జరిగితే వేలాది ఎకరాల్లో ఉన్న కంటోన్మెంట్ ల్యాండ్ బల్దియా పరమవుతుంది. జంటనగరాల నడిబొడ్డున ఉండటంతో మార్కెట్ దండిగా ఉంటుంది. వేలే కాదు లక్షల కోట్ల విలువ చేస్తుంది.