Docter Died
doctor and patient died : కామారెడ్డి జిల్లాలో విషాదం నెలకొంది. ఆస్పత్రిలో డాక్టర్, పేషెంట్ ఇద్దరూ మృతి చెందారు. పేషెంట్ కు చికిత్స చేస్తుండగా గుండె పోటుతో డాక్టరు మృతి చెందాడు. చికిత్స పొందుతున్న పేషెంట్ కూడా మరణించాడు.
వివరాల్లోకి వెళ్తే…కామారెడ్డి జిల్లా గాంధారి మండలం గుజ్జల్ తండాకు చెందిన వ్యక్తికి ఉదయం హార్ట్ స్ట్రోక్ వచ్చింది. దీంతో చికిత్స కోసం అతన్ని గాంధారిలోని నర్సింగ్ హోమ్ కు తరలించారు. పేషెంట్ కు చికిత్స చేస్తున్న డా.లక్ష్మణ్ కు కూడా గుండె పోటు వచ్చింది.
Etela Rajender : ధనిక రాష్ట్రమంటున్న సీఎం కేసీఆర్ ధాన్యం ఎందుకు కొనలేకపోతున్నారు : ఈటల
దీంతో డాక్టర్ లక్ష్మణ్ మృతి చెందారు. చికిత్స మధ్యలోనే ఆగిపోవడంతో పేషెంట్ కూడా మరణించారు. డాక్టర్, పేషెంట్ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.