Warangal MGM: వార్డుల్లో ఎలుకల బెడద అవాస్తవం.. ఎంజీఎంను రాజకీయ వేదికగా మార్చొద్దు

వరంగల్ ఎంజీఎం ఆస్పత్రి వార్డుల్లో ఎలుకల బెడద లేదని, ముందు జాగ్రత్తతోనే బోన్లు పెట్టామని ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రశేఖర్ అన్నారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. ఎంజీఎం ఆస్పత్రిపై కొందరు అసత్య ఆరోపణలు చేయడం సరికాదని అన్నారు.

Warangal MGM

Warangal MGM: వరంగల్ ఎంజీఎం ఆస్పత్రి వార్డుల్లో ఎలుకల బెడద తీవ్రంగా ఉందన్న ఆరోపణలపై ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రశేఖర్ తీవ్రంగా స్పందించారు. ఎంజీఎం ఆస్పత్రిలో ఎలుకల బెడద ఉందనడం సరికాదని అన్నారు. ఎంజీఎంను కొందరు వ్యక్తులు పార్టీలు రాజకీయ వేదికగా మార్చొద్దని చంద్రశేఖర్ విజ్ఞప్తి చేశాడు. ఎలుకల పేరుతో కొందరు ఎంజీఎం ప్రతిష్టను దెబ్బతీసే కుట్ర చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

MGM Hospital : వరంగల్ ఎంజీఎంలో దారుణం.. పేషెంట్‌‌పై ఎలుకల దాడి.. తీవ్ర రక్తస్రావం..!

ఐదు నెలల కిందటే ఈ వ్యవహారాన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుందని, ఎలుకల నివారణ కోసం ఎంజీఎంలో టాస్క్‌ఫోర్స్ టీంతో సహా ఐదు బృందాలు పనిచేస్తున్నాయని తెలిపారు. వార్డుల్లో ఎలుకల బెడద అవాస్తవమని, ముందు జాగ్రత్తతోనే బోన్లు పెట్టామని తెలిపారు. ప్రస్తుతం డాక్టర్లు, సిబ్బంది ఎంజీఎంలో ఇన్ పేషెంట్లకు మెరుగైన వైద్యం అందించడంపైనే దృష్టి పెట్టారన్నారు.

Warangal MGM Hospital : వరంగల్ ఎంజిఎం ఆస్పత్రి ఎదుట కరోనాతో వృద్ధుడు మృతి

1300 నుంచి 5వేల వరకు ఓపీ పెరిగిందంటేనే ఎంజీఎంలో వైద్యులు, సిబ్బంది అంకితభావాన్ని గుర్తించొచ్చు అని డాక్టర్ చంద్రశేఖర్ అన్నారు. ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు డాక్టర్లు, సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారని తెలిపారు. సోషల్ మీడియాలో దుష్ప్రచారంతో ఎంజీఎం ధైర్యం దెబ్బతీయొద్దుని కోరారు. ఎంజీఎంను ప్రతిష్టాత్మకమైన వ్యవస్థగా మార్చే లక్ష్యంతో పనిచేస్తున్నామని, ప్రస్తుతం జ్వరాల సీజన్‌లో ఎంజీఎంపై అపోహలు సృష్టించి పేదలకు నష్టంచేయొద్దని డాక్టర్ చంద్రశేఖర్ కోరారు.