Falling Temperatures : తెలంగాణను వణికిస్తున్న చలి పులి.. సీజనల్‌ వ్యాధులతో జాగ్రత్త..!

ఇప్పటికే ఒమిక్రాన్‌ భయంతో రాష్ట్ర ప్రజలు వణికిపోతుంటే... చలికాలం జనాలను మరింత టెన్షన్‌ పెట్టిస్తోంది. చలి తీవ్రత ఎక్కువగా ఉంటే అది అనేక ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది.

Telangana (1)

temperatures falling in Telangana : తెలంగాణను చలిపులి వణికిస్తోంది. కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. రాష్ట్రంలో చలి తీవ్రత పెరిగిపోయింది. ఈ సమయమే సీజనల్‌ వ్యాధులు స్ప్రెడ్‌ అవడానికి అనువైన వాతావరణం. అందుకే ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.

ఇప్పటికే ఒమిక్రాన్‌ భయంతో రాష్ట్ర ప్రజలు వణికిపోతుంటే… చలికాలం జనాలను మరింత టెన్షన్‌ పెట్టిస్తోంది. చలి తీవ్రత ఎక్కువగా ఉంటే అది అనేక ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది. సీజనల్‌ వ్యాధులు ప్రబలడానికి అనుకూలమైన వాతావరణమని హెచ్చరిస్తున్నారు వైద్యులు.

Christmas : దేశవ్యాప్తంగా క్రిస్‌మస్‌ సంబరాలు

శీతాకాలంలో ఫ్లూ వ్యాధులు వస్తుంటాయని… అందుకే ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు. చిన్న పిల్లలు, వృద్ధులు చలి నుంచి కాపాడుకోవాలని అంటున్నారు. లేకపోతే త్వరగా శ్వాసకోశ సమస్యలు తలెత్తే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు. గర్భిణులు సైతం జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు వైద్యులు.

ఇప్పటికే ఒమిక్రాన్‌ వేరియంట్‌తో ఇబ్బందులు పడుతున్నారు జనం. వీటికి తోడు ఫ్లూ వ్యాధులు పెరిగితే పరిస్థితి మరింత దారుణంగా తయారయ్యే ప్రమాదముంది. కరోనా లక్షణాలు, ఫ్లూ, వైరల్‌ లక్షణాలు సైతం ఒకేలా ఉండడంతో జనం కంగారు పడొద్దని సూచిస్తున్నారు.

PM Modi : గురునానక్‌ జయంతి వేడుకల్లో పాల్గొననున్న ప్రధాని మోదీ

సమీపంలోని పరీక్షా కేంద్రాలకు వెళ్లి టెస్టులు చేయించుకోవాలని సూచిస్తున్నారు. లేకపోతే వైరస్ త్వరగా కoటామినేట్ అయ్యే ప్రమాదం ఉందని చెబుతున్నారు. క్రిస్టమస్, న్యూ ఇయర్ వేడుకలకు దూరంగా ఉండే ప్రయత్నం చేయాలని… సూచిస్తున్నారు వైద్యులు.