PM Modi : గురునానక్‌ జయంతి వేడుకల్లో పాల్గొననున్న ప్రధాని మోదీ

లఖ్‌పాత్‌ సాహిబ్‌ గురుద్వారాలో.. గురునానక్‌ చెక్క పాదరక్షలు, ఊయల ఉన్నాయి. దీంతో సిక్కులు లఖ్‌పత్‌ సాహిత్‌ గురుద్వారాను పరమ పవిత్రంగా భావిస్తారు.

PM Modi : గురునానక్‌ జయంతి వేడుకల్లో పాల్గొననున్న ప్రధాని మోదీ

Modi (1)

Updated On : December 25, 2021 / 6:53 AM IST

Guru Nanak Jayanti celebrations : సిక్కు మత వ్యవస్థాపకుడు గురునానక్‌ దేవ్‌ గురుపురబ్‌ ఉత్సవాల్లో ప్రధాని నరేంద్రమోదీ పాల్గొననున్నారు. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఆయన సిక్కులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ మేరకు ప్రధాని కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. ప్రతి ఏటా డిసెంబర్‌ 23 నుంచి 25 వరకు గుజరాత్‌లోని సిక్కులు… గురునానక్‌ దేవ్‌జీ గురుపురబ్‌ ఉత్సవాలను జరుపుకుంటారు. కచ్‌లోని లఖ్‌పత్‌ సాహిబ్‌ గురుద్వారాలో ఈ ఉత్సవాలు జరుగుతాయి.

లఖ్‌పాత్‌ సాహిబ్‌ గురుద్వారాలో.. గురునానక్‌ చెక్క పాదరక్షలు, ఊయల ఉన్నాయి. దీంతో సిక్కులు లఖ్‌పత్‌ సాహిత్‌ గురుద్వారాను పరమ పవిత్రంగా భావిస్తారు. ప్రతి ఏటా ఆయన జయంతి ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటారు. ఇందులో భాగంగా ఇవాళ గురుపురబ్‌ ఉత్సవాలు ముగియనున్నాయి. ఈ ఉత్సవాల ముగింపు సందర్భంగా ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు.

Kadapa Tour : సీఎం జగన్‌ కడప జిల్లా పర్యటన.. క్రిస్‌మస్‌ ప్రార్థనల్లో పాల్గొననున్న ముఖ్యమంత్రి

2001లో గుజరాత్‌లో సంభవించిన భూకంప సమయంలో… గురుద్వారా దెబ్బతింది. అప్పుడు సీఎంగా ఉన్న మోదీ…. ప్రభుత్వం తరపున మరమ్మతులు చేపట్టారు. గురుద్వారా మరమ్మతులకు అయిన పూర్తి ఖర్చును ప్రభుత్వమే భరించింది. దీంతో అప్పటి నుంచి మోదీని సిక్కులు ఆహ్వానిస్తూ వస్తున్నారు. ఇందులో భాగంగా తన సందేశాన్ని వినిపించనున్నారు ప్రధాని మోదీ.