Kadapa Tour : సీఎం జగన్‌ కడప జిల్లా పర్యటన.. క్రిస్‌మస్‌ ప్రార్థనల్లో పాల్గొననున్న ముఖ్యమంత్రి

క్రిస్‌మస్‌ సందర్భంగా సీఎస్‌ఐ చర్చిలో ప్రార్థనలు ఏర్పాటు చేశారు. ఈ ప్రార్థనలు ముగిసిన తర్వాత సీఎం జగన్ కడప పర్యటన ముగించుకుని.. అమరావతికి తిరుగు పయనమవుతారు.

Kadapa Tour : సీఎం జగన్‌ కడప జిల్లా పర్యటన.. క్రిస్‌మస్‌ ప్రార్థనల్లో పాల్గొననున్న ముఖ్యమంత్రి

Jagan (9)

Updated On : December 25, 2021 / 6:37 AM IST

CM Jagan Kadapa district tour : ఏపీ సీఎం జగన్‌ తన సొంత జిల్లా కడప పర్యటనలో ఉన్నారు. రెండు రోజులుగా జిల్లాలోనే పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇవాళ జగన్‌ పులివెందులలోని సీఎస్‌ఐ చర్చిలో ప్రార్థనల్లో పాల్గొంటారు. క్రిస్‌మస్‌ సందర్భంగా సీఎస్‌ఐ చర్చిలో ప్రార్థనలు ఏర్పాటు చేశారు. ఈ ప్రార్థనలు ముగిసిన తర్వాత ఆయన కడప పర్యటన ముగించుకుని.. అమరావతికి తిరుగు పయనమవుతారు.

జగన్‌ నిన్న ఆయన సొంత నియోజకవర్గం పులివెందులలో పర్యటించారు. పులివెందులలో 323 ఎకరాల్లో జగనన్న కాలనీ నిర్మిస్తున్నట్లు సీఎం జగన్‌ వెల్లడించారు. ఒక్కో ఇంటి పట్టా విలువ కనీసం 2 లక్షల రూపాయలు ఉంటుందన్నారు. 147 కోట్ల రూపాయలతో జగనన్న కాలనీ అభివృద్ధి చేస్తున్నట్లు జగన్ తెలిపారు. జగనన్న కాలనీలో 8వేల 42 మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేసినట్లు సీఎం జగన్‌ తెలిపారు.

Omicron Medicine : ఒమిక్రాన్ మందులు ఇవే.. కీలక విషయాలు చెప్పిన లోక్ నాయక్ ఆసుపత్రి వైద్యులు

ప్రభుత్వం ఒక్కో ఇంటిపై 6 లక్షలు ఖర్చు పెడుతోందని తెలిపారు. కోర్టు కేసుల కారణంగా కార్యక్రమం ఆలస్యమయిందన్నారు. జగనన్న కాలనీలో అన్ని రకాల మౌలిక సదుపాయల అభివృద్ధి చేపట్టినట్లు తెలిపారు. జగనన్న కాలనీకి సమీపంలోనే ఇండస్ట్రీయల్‌ కారిడార్‌ ఏర్పాటు చేయనున్నట్లు, నివాస ప్రాంతాలకు సమీపంలోనే ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు సీఎం జగన్‌.పులివెందులలో ఆక్వాహబ్‌ సహా అనేక కార్యక్రమాలు చేపట్టనున్నట్లు జగన్‌ హామీనిచ్చారు.