Telangana Government : ప్రభుత్వ ఆస్పత్రుల్లో బెడ్స్ అన్నింటికీ ఆక్సిజన్ సౌకర్యం

ప్రభుత్వ ఆస్పత్రుల్లో బెడ్స్ అన్నింటికీ ఆక్సిజన్ సౌకర్యం కల్పించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. నెల రోజుల్లో ఈ పని పూర్తి చేయాలని వైద్య ఆరోగ్యశాఖ ప్రతిపాదించింది.

Telangana government : ప్రభుత్వ ఆస్పత్రుల్లో బెడ్స్ అన్నింటికీ ఆక్సిజన్ సౌకర్యం కల్పించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. నెల రోజుల్లో ఈ పని పూర్తి చేయాలని వైద్య ఆరోగ్యశాఖ ప్రతిపాదించింది. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై హైకోర్టుకు అందజేసిన నివేదికలో ఈ విషయాన్ని పొందుపరిచింది. కోవిడ్ డెల్టా వేరియంట్ తో పాటు థర్డ్ వేవ్ పై ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని ప్రజారోగ్యశాఖ డైరెక్టర్ శ్రీనివాసరావు హైకోర్టుకు తెలియచేశారు. రాష్ట్రంలో డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు నమోదు కాలేదన్న డీహెచ్..ఇది ప్రమాదకరమైన వైరస్ అనడానికి అధారాలు లేవని కోర్టు దృష్టికి తెచ్చారు.

హైకోర్టుకు అందజేసిన నివేదికలో వ్యాక్సినేషన్ అంశాన్ని పొందుపరిచారు. ఇప్పటివరకు 14 లక్షల మందికి టీకా విషయాన్ని నివేదించింది. 16 లక్షల 39 వేల మందికి రెండు డోసులు పూర్తి చేస్తే, 81 లక్షల 42 వేల మందికి ఒక డోస్ ఇచ్చింది. మరో కోటి 75 లక్షల మందికి వ్యాక్సినేషన్ ఇవ్వాల్సి ఉందన్న విషయాన్ని ప్రభుత్వం హైకోర్టు దృష్టికి తెచ్చింది. విద్యా సంస్థల్లో పని చేస్తున్న లక్షా 40 వేల మంది సిబ్బందికి టీకా వేశారు.

విదేశాలకు వెళ్లే విద్యార్థుల కోసం 11 కేంద్రాల్లో వ్యాక్సినేషన్ ఇస్తున్న విషయాన్ని నివేదికలో ప్రభుత్వం ప్రస్తావించింది. రాష్ట్రంలో రోజుకు సంగటున లక్షా 12 వేల మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తున్నట్లు నివేదించింది. పాజిటివ్ రేటు ఒక శాతం లోపే ఉందని హైకోర్టు దృష్టికి తెచ్చింది. కరోనా చికిత్సకు అధిక ఫీజులు వసూలు చేసిన ప్రైవేట్ ఆస్పత్రులపై చర్యలు తీసుకున్న విషయాన్ని ప్రస్తావించింది.

ట్రెండింగ్ వార్తలు