Telangana Government : ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు పరిహారం విడుదల

మొత్తం 133 కుటుంబాలకు 7కోట్ల 95 లక్షల రూపాయలను విడుదల చేశారు. ఈ మేరకు నిధుల విడుదలపై విపత్తుల నిర్వహణశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

Kcr

Telangana government released compensation : తెలంగాణలో ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం పరిహారం విడుదల చేసింది. గతంలో జారీ చేసిన ఉత్తర్వులకు అనుగుణంగా ఒక్కో రైతు కుటుంబానికి 6లక్షల రూపాయల చొప్పున పరిహారం అందజేయనున్నారు. మొత్తం 133 కుటుంబాలకు 7కోట్ల 95 లక్షల రూపాయలను విడుదల చేశారు. ఈ మేరకు నిధుల విడుదలపై విపత్తుల నిర్వహణశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

వికారాబాద్‌ జిల్లాలో 27 కుటుంబాలకు, యాదాద్రి భువనగిరి జిల్లాలో 23 కుటుంబాలకు, నల్గొండలో 17, భూపాపలపల్లి 12, జనగాంలో 10, హన్మకొండ, ములుగు జిల్లాల్లో 9 కుటుంబాలకు పరిహారం ప్రకటించారు. ఖమ్మంలో 6, కొత్తగూడెంలో 5, వరంగల్‌లో 3, నిజామాబాద్‌లో 3 కుటుంబాలకు పరిహారం అందించనున్నారు.

KTR Goa Tour : ఫ్యామిలీతో కలిసి గోవా వెళ్లిన మంత్రి కేటీఆర్

మహబూబాబాద్, మెదక్, నారాయణపేట జిల్లాల్లో రెండు చొప్పున కుటుంబాలకు, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, సూర్యాపేట జిల్లాల్లో ఒక్కో కుటుంబానికి పరిహారం అందనుంది. ఈ మేరకు విపత్తు నిర్వహణా శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా ఉత్తర్వులు జారీ చేశారు.