Dead
HyderabadHyderabad:హైదరాబాద్‌లోని బోయిన్‌పల్లిలో విచిత్ర సంఘటన జరిగింది. ఓ వ్యక్తి చనిపోయాడనుకుని కుటుంబ సభ్యులు అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. శ్మశాన వాటికకు సమాచారం అందించారు. బంధు, మిత్రులందరూ శోకసంద్రంలో మునిగిపోయారు. కాగా, ఆ వ్యక్తి ఒక్కసారిగా చేయి కదిలించడంతో అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. వెంటనే అతడిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.
బోయిన్‌పల్లి పరిధిలో నివాసముండే ప్రసాద్ శర్మకు మంగళవారం గుండెపోటు వచ్చింది. కుటుంబ సభ్యులు అతడిని చికిత్స కోసం ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. వెంటిలేటర్‌పై వైద్యులు అతడికి చికిత్స అందించారు. కుటుంబ సభ్యులు అతడు చనిపోయాడనుకుని ఇంటికి తీసుకెళ్లారు. అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు.
Raj Babbar: ఎన్నికల అధికారిపై దాడి కేసు… నటుడు రాజ్ బబ్బర్‌కు రెండేళ్ల జైలు శిక్ష
కాగా, ప్రసాద్‌శర్మ ఒక్కసారిగా తన చేయిని కదిలించారు. ఈ ఘటనతో అవాక్కైన కుటుంబ సభ్యులు అతడిని వెంటనే చికిత్స కోసం మళ్లీ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు అతనికి చికిత్స అందిస్తున్నారు.