జగిత్యాల జిల్లాలో మరో కరోనా కలకలం.. ముగ్గురిలో లక్షణాలు

తెలంగాణలో కరోనా వైరస్ కలకలం రేపుతోంది. జగిత్యాల జిల్లాలో మరో కరోనా అనుమానిత కేసు వెలుగులోకి వచ్చింది. బుగ్గారం మండలం గోపులాపురానికి చెందిన ఓ వ్యక్తికి కరోనా

  • Published By: veegamteam ,Published On : March 14, 2020 / 02:17 PM IST
జగిత్యాల జిల్లాలో మరో కరోనా కలకలం.. ముగ్గురిలో లక్షణాలు

Updated On : March 14, 2020 / 2:17 PM IST

తెలంగాణలో కరోనా వైరస్ కలకలం రేపుతోంది. జగిత్యాల జిల్లాలో మరో కరోనా అనుమానిత కేసు వెలుగులోకి వచ్చింది. బుగ్గారం మండలం గోపులాపురానికి చెందిన ఓ వ్యక్తికి కరోనా

తెలంగాణలో కరోనా వైరస్ కలకలం రేపుతోంది. జగిత్యాల జిల్లాలో మరో కరోనా అనుమానిత కేసు వెలుగులోకి వచ్చింది. బుగ్గారం మండలం గోపులాపురానికి చెందిన ఓ వ్యక్తికి కరోనా లక్షణాలు ఉన్నట్లుగా వైద్యులు నిర్దారించారు. వెంటనే అతడిని హైదరాబాద్‌ గాంధీకి తరలించారు. ఆ వ్యక్తి 10 రోజుల క్రితం దుబాయ్‌ నుంచి జగిత్యాలకు వచ్చాడు. వచ్చినప్పటి నుంచి తీవ్ర జ్వరం, జలుబుతో బాధపడుతున్నాడు. ఇప్పటి వరకు జగిత్యాలలో ముగ్గురు వ్యక్తులకు కరోనా లక్షణాలు కనిపించడంతో మెరుగైన చికిత్స కోసం గాంధీకి తరలించారు. ప్రస్తుతం వారికి వైద్య పరీక్షలు చేస్తున్నారు. రక్త నమూనాలు సేకరించి ల్యాబ్ కి పంపారు. రిపోర్టు కోసం వేచి చూస్తున్నారు.

జగిత్యాల జిల్లాలో భయం..భయం:
జగిత్యాల జిల్లా గజ..గజ వణికిపోతుంది. కరోనా కేసులు పెరిగిపోవడంతో ప్రజలు భయందోళన చెందుతున్నారు. బయటకు వెళ్లేందుకు కూడా జనం సాహసం చెయ్యడం లేదు. ఎప్పుడు ఎవరి వైపు నుంచి ప్రమాదం పొంచి ఉందో తెలియక ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బతుకు వెళ్లదీస్తున్నారు. పిల్లలను స్కూళ్లకు పంపించాలన్న భయపడిపోతున్నారు పేరెంట్స్‌. తాజాగా మరొకరికి కరోనా లక్షణాలు కనిపించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. సేఫ్టీ ప్రికాషన్స్‌ తీసుకోవాలని సూచిస్తున్నారు. 

తెలంగాణకు కరోనా ముప్పు ఉండదని అనుకున్నారు:
కరోనా వైరస్‌తో తెలంగాణకు ఎలాంటి ముప్పు ఉండదని అందరూ అనుకున్నారు. ఇదే విషయాన్ని సీఎం కేసీఆర్‌ సైతం చెప్పారు. తెలంగాణలో ఉన్న ఉష్ణోగ్రతలకు కరోనా వైరస్‌ బతకదని ధైర్యం చెప్పారు. కానీ కరోనా తెలంగాణలోనూ విజృంభిస్తోంది. భారతదేశంలో ఇప్పటి వరకు 87 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో పలువురు విదేశీయులు ఉన్నారు. కరోనా బారిన పడ్డ వారిలో ముగ్గురు మరణించారు. వారంతా వృద్ధులే. 

మంచిర్యాలలో కరోనా కలకలం:
మంచిర్యాలలోనూ కరోనా కలకలం రేగింది. నస్పూర్ వాసికి కరోనా లక్షణాలు ఉన్నట్టు గుర్తించారు. వారం రోజుల క్రితం ఆ వ్యక్తి ఇటలీ నుంచి వచ్చాడు. ఆ వ్యక్తి జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడుతున్నాడు. వెంటనే ఆ వ్యక్తిని అధికారులు హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. గాంధీ ఆసుపత్రిలో కరోనా ఐసోలేషన్ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. అతడి రక్త నమూనాలు సేకరించిన డాక్టర్లు ల్యాబ్ కి పంపారు. రిపోర్టు వస్తే కానీ ఏ విషయం తెలియదు. నిన్నటి వరకు తెలంగాణలో కేవలం ఒక కరోనా కేసు మాత్రమే ఉంది. అతడు కూడా పూర్తిగా కోలుకున్నాడు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇంతలోనే తెలంగాణలో ఈ ఒక్క రోజే(మార్చి 14,2020) మూడు అనుమానిత కేసులు నమోదు కావడం కలకలం రేపుతోంది. 

తెలంగాణ షట్ డౌన్:
కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టడంలో భాగంగా కీలకమైన నిర్ణయాలను తీసుకొంది తెలంగాణ సర్కార్‌. మార్చి 31 వరకు.. తెలంగాణ వ్యాప్తంగా స్కూళ్లు, కాలేజీలు, థియేటర్లు, మాల్స్‌ను మూసివేయాలని నిర్ణయించింది. ఇప్పటికే తెలంగాణలో ఓ పాజిటివ్‌ కేసు నమోదు కాగా.. అతనికి విజయవంతంగా నయం చేశారు గాంధీ వైద్యులు. అయితే.. ఇవాళ మరొకరికి కరోనా పాజిటివ్‌ నమోదు కావడంతో.. తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. వైరస్‌ వ్యాప్తిని నిరోధించడంలో వచ్చే రెండు వారాలు చాలా కీలకంగా భావిస్తున్న సర్కార్..వీలైనంతగా ప్రజలు గుమిగూడకుండా చూడాలనుకుంటోంది.