తెలంగాణలో అర్థరాత్రి రక్తమోడిన రహదారులు.. వేర్వేరు ప్రమాదాలో 11 మంది మృతి

సూర్యాపేట, వరంగల్, సంగారెడ్డి జిల్లాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 11మంది మృతి చెందగా.. పలువురు గాయాలతో ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

Road Accidents In Telangana : తెలంగాణలోని రహదారులు అర్ధరాత్రి రక్తమోడాయి. వేరువేరు ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 11మంది మృతి చెందారు. అతివేగం, నిర్లక్ష్యం వారి కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. కన్నవాళ్లకు కడుపు కోతను మిగిల్చాయి. ఈ మూడు ప్రమాదాల్లో రెండు కార్లు ఆగిఉన్న లారీలను ఢీకొట్టాయి. మరో ప్రమాదంలో నలుగురు యువకులు ఒకే బైక్ పై వెళ్తూ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు.

Also Read : Road Accident : సూర్యాపేట జిల్లాలో జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం..

సూర్యాపేట జిల్లా కోదాడ మండలం దుర్గాపురం వద్ద జాతీయ రహదారిపై ఆగిఉన్న లారీని కారు ఢీకొట్టింది. తెల్లవారు జామున 4గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం సమయంలో కారులో ప్రయాణిస్తున్న పది మందిలో ఆరుగురు అక్కడికక్కడే మరణించారు. మరో నలుగురికి గాయాలు కావడంతో వారిని చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే, వారిలో మహిళ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మృతులలో ఐదుగురు ఖమ్మం జిల్లా బోనకల్ మండలం ఎల్ గోవిందపురంకు చెందిన వారు కాగా, మరొకరు కోదాడ మండలం చిమిర్యాల గ్రామానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. విజయవాడ వద్ద ఉన్న గుణదల చర్చిలో చిన్నపాప లాస్యకు చెవిదిద్దులు కుట్టించడానికి కారులో వెళ్తుండగా ప్రమాదం జరిగింది. మృతులను మాణిక్యమ్మ, చంద్రరావు, కృష్ణరాజు, స్వర్ణ, శ్రీకాంత్, లాస్యలుగా గుర్తించారు.

Also Read : Video: ఎన్నికల ప్రచారంలో స్పృహ తప్పి పడిపోయిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ

వరంగల్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు యువకులు మృతి చెందారు. వర్ధన్నపేట మండలం ఇల్లంద శివారు వరంగల్ – ఖమ్మం జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. నలుగురు యువకులు ఒకే బైక్ వెళ్తున్నారు. ఓ ప్రైవేట్ బస్సు ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మరణించగా.. మరో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. అతన్ని చికిత్స నిమిత్తం వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అతనుకూడా మరణించాడు. మృతులు ఇల్లంద గ్రామానికి చెందిన సిద్ధు, వరుణ్ తేజ, గణేష్, అనిల్ కుమార్ లుగా గుర్తించారు. జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదంతో గంటన్నరకుపైగా వాహనాలు నిలిచిపోయాయి. ఈ ఘనటపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అదేవిధంగా సంగారెడ్డి జిల్లా ముత్తంగి ఓఆర్ఆర్ పై రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగిఉన్న లారీని కారు ఢీకొట్టింది. కారులో మంటలు చెలరేగి ఒకరు సజీవదహనం అయ్యారు.

 

ట్రెండింగ్ వార్తలు