Tiger : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పులి కలకలం

జయశంకర్ భూపాలపల్లి జిల్లా వీరాపూర్ అడవుల్లో పులి కలకలం రేపింది. రెండు రోజుల క్రితం పశువుల మందపై పులి దాడి చేసింది. కొన్నిరోజులుగా పులి సంచరిస్తుండటంతో ట్రాకింగ్ కెమెరాలను అమర్చారు.

Tiger

Tiger in Jayashankar Bhupalpally : జయశంకర్ భూపాలపల్లి జిల్లా వీరాపూర్ అడవుల్లో పులి కలకలం రేపింది. రెండు రోజుల క్రితం పశువుల మందపై పులి దాడి చేసింది. అయితే కొన్నిరోజులుగా పులి సంచరిస్తుండటంతో అధికారులు ట్రాకింగ్ కెమెరాలు అమర్చారు.

ట్రాకింగ్ కెమెరాకు పులి ఫొటోలు చిక్కాయి. గేదె కళేబరం వద్ద పులి ఫొటోలు ట్రాకింగ్ కెమెరాలో రికార్డు అయ్యాయి. అయితే ఈ ఫొటోలు ఇక్కడవి కాదని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు.

Manchu Vishnu : సైనికుడు సాయితేజ భార్యకు ఫోన్ లో మంచు విష్ణు పరామర్శ

వేటగాళ్ల భయంతో పులి ఫొటోలు బయటకు పొక్కకుండా చేద్దామని అటవీ శాఖ అధికారులు భావిస్తున్నప్పటికీ సోషల్ మీడియాలో పులి ఫొటోలు వైరల్ గా మారాయి. పులి సంచరిస్తుండటంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు.