Manchu Vishnu : సైనికుడు సాయితేజ భార్యకు ఫోన్ లో మంచు విష్ణు పరామర్శ

హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందిన సైనికుడు సాయితేజ కుటుంబాన్ని ’మా‘ అధ్యక్షులు మంచు విష్ణు ఫోన్ లో పరామర్శించారు. సాయితేజ భార్య శ్యామలను ఫోన్ లో ఆయన పరామర్శించి, ఓదార్పారు.

Manchu Vishnu : సైనికుడు సాయితేజ భార్యకు ఫోన్ లో మంచు విష్ణు పరామర్శ

Manchu Vishnu

Manchu Vishnu Consold family of Saiteja : హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందిన సైనికుడు సాయితేజ కుటుంబాన్ని మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ అధ్యక్షులు మంచు విష్ణు ఫోన్ లో పరామర్శించారు. సాయితేజ భార్య శ్యామలను ఫోన్ లో మంచు విష్ణు పరామర్శించారు. ధైర్యంగా ఉండాలని, సాయితేజ కుటుంబానికి అండగా ఉంటామని పేర్కొన్నారు. ఇద్దరు పిల్లలను తానే చదివిస్తానని శ్యామలకు హామీ ఇచ్చారు. 10 రోజుల్లో తానే వచ్చి కలుస్తానని తెలిపారు.

తమిళనాడు నీలగిరి జిల్లా కూనూర్‌ వద్ద భారత వాయుసేనకు సంబంధించిన ఎంఐ17వీ5 (Mi-17V5) హెలికాప్టర్‌ కూలిపోయిన విషయం తెలిసిందే. హెలికాప్టర్‌ ప్రమాదంలో మరణించిన 13మందిలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన సాయితేజ్‌ కూడా ఉన్నారు. చిత్తూరు జిల్లా కురుబలకోట మండలం ఎగువరేగడ గ్రామానికి చెందిన సాయితేజ్‌ ఈ ప్రమాదంలో మృతి చెందారు. ఆర్మీ అధికారులు సాయితేజ కుటుంబసభ్యులకు సమాచారం అందించడంతో.. ఆయన స్వస్థలం ఎగువ రేగడ గ్రామస్తులు విషాదంలో మునిగిపోయారు.

Road Accident : కేరళలో రోడ్డు ప్రమాదం..ఏపీకి చెందిన ఇద్దరు అయ్యప్ప భక్తులు మృతి

2015 లో సిద్ధారెడ్డి పల్లికి చెందిన శ్యామలతో సాయితేజ్​కు వివాహం అయింది. వీరికి కుమారుడు మోక్షజ్ఞ(4), కూతురు దర్శిని(2) ఉన్నారు. వీరి కుటుంబం మదనపల్లె ఎస్​బీఐ కాలనీలో ఏడాది కాలంగా నివాసం ఉంటోంది. ఇవాళ ఉదయమే సాయితేజ్ వీడియో కాల్ చేసి పిల్లలతో మాట్లాడారని కుటుంబ సభ్యులు తెలిపారు. చివరిసారిగా గత వినాయకచవితికి స్వగ్రామం ఎగువ రేగడకు సాయితేజ్‌ వచ్చి వెళ్లినట్లు కుటుంబసభ్యులు గుర్తుచేసుకుంటున్నారు.

2013లో సాయితేజ్ ఆర్మీలో జవానుగా చేరారు. ఏడాది తర్వాత పారా కమెండో శిక్షణ పూర్తి చేసుకున్నాడు. స్పెషల్ ఫోర్సెస్​ 11 పారా విభాగంలో లాన్స్ నాయక్ హోదాలో విధులు నిర్వర్తిస్తున్నారు. బెంగళూరులో సైనికులకు శిక్షకుడిగా పని చేసిన సాయితేజ్.. ప్రస్తుతం బిపిన్ రావత్ వ్యక్తిగత భద్రతలో విధులు నిర్వర్తిస్తున్నారు. కాగా, సాయితేజ్ తమ్ముడు కూడా ఆర్మీలోనే సేవలందిస్తున్నారు. సాయితేజ్ మహేష్ బాబు సిక్కింలో ఆర్మీ విధులు నిర్వహిస్తున్నారు.