Actress Hema: జనసేనలో జాయిన్ అవుతారా? 10టీవీ వీకెండ్ పాడ్‌కాస్ట్‌లో నటి హేమ ఆసక్తికర వ్యాఖ్యలు..
మళ్లీ జనంలోకి వెళ్లాలి అనుకుంటే 100 శాతం డెడికేషన్ తో వెళ్లాలి. ఏ పార్టీలోకి వెళ్లాలి..
- Naveen
- Published On : November 30, 2025 / 09:03 PM IST
Actress Hema: 10టీవీ వీకెండ్ పాడ్ కాస్ట్ లో నటి హేమ పాల్గొన్నారు. స్పెషల్ ఇంటర్వ్యూలో పలు అంశాలపై ఆమె స్పందించారు. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏదైనా రాజకీయ పార్టీలోకి వెళ్లాలని అనుకుంటున్నారా? ఒకవేళ వెళ్తే ఏ పార్టీలోకి వెళ్తారు? జనసేనలో జాయిన్ అయ్యేందుకు ఆసక్తి చూపిస్తున్నారా? ఈ ప్రశ్నలకు నటి హేమ ఆసక్తికర సమాధానం ఇచ్చారు..
”మళ్లీ జనంలోకి వెళ్లాలి అనుకుంటే 100 శాతం డెడికేషన్ తో వెళ్లాలి. ఏ పార్టీలోకి వెళ్లాలి అనే దాని గురించి నేను ఇంకా ఏమీ అనుకోలేదు. తొందరలోనే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ని కలుస్తాను. మా అసోసియేషన్ గురించి ఆయనతో మాట్లాడాలి. మా కి ఆయన సపోర్ట్ కావాలి. ఇప్పటివరకు మేము ఒక్క ఈవెంట్ చేయలేదు. మా లో నాలుగు సంవత్సరాల నుంచి ఏమీ లేదు. ఉన్న డబ్బులే ఖర్చు పెడుతున్నాము.
మాకొక పెద్ద హీరో సపోర్ట్ కావాలి. మా ఇండస్ట్రీ మనిషి కనుక పవన్ ను కలుస్తాను. నేను ముద్రగడ పద్మనాభం కాపు ఉద్యమంలో కూడా పాల్గొన్నాను. రాజకీయాల గురించి కంటే ముందుగా నా మీద జరిగిన దాడి గురించి, మా అసోసియేషన్ కు మద్దతు కోసం పవన్ కల్యాణ్ ను కలుస్తాను. మా అసోసియేషన్ కి ఒక పవర్ ఉండాలి. మా లో ఒక మెంబర్ గురించి అవతలి వ్యక్తి ఎవరైనా మాట్లాడితే.. యాక్షన్ ఉంటుంది అనే భయం కలగాలి’ అని నటి హేమ అన్నారు.
Also Read: ఇదేం ఫ్యానిజం రా బాబు.. ఒక టికెట్ లక్ష పెట్టి కొన్నాడు.. బాలయ్య క్రేజ్ మాములుగా లేదుగా..
