×
Ad

Beautiful Waterfalls : వర్షాలు పడుతున్నాయ్.. తెలంగాణలో జలపాతాలకు టూర్ వేస్తారా..! హైదరాబాద్ దగ్గరలో వాటర్ ఫాల్స్ ఇవే.. ఓసారి వెళ్లిరండి..!

Beautiful Waterfalls : తెలంగాణలో వర్షపు నీటితో జలపాతాల వద్ద ఆహ్లాదరక వాతావరణం కనిపిస్తోంది. హైదరాబాద్ సమీపంలో కొన్ని వాటర్ ఫాల్స్ ఉన్నాయి..

Beautiful Waterfalls

Beautiful Waterfalls : అసలే వర్షాల సీజన్.. జోరుగా వర్షాలు పడుతున్నాయి. ఎక్కడ చూసినా వర్షపు నీటితో జలకల కనిపిస్తోంది. వర్షపు సీజన్ సమయాల్లో (Beautiful Waterfalls) జలపాతాల వద్ద వాతావరణం అద్భుతంగా ఉంటుంది. అందుకే చాలామంది సరదగా గడిపేందుకు వెళ్తుంటారు.

కానీ, వర్షాల సమయంలో జలపాతాల వద్ద నీటి ప్రవాహం ఎక్కువగా ఉంటుంది. అందుకే అక్కడ సరదగా గడిపేందుకు ఎక్కువ ఇష్టపడుతుంటారు. ఏదిఏమైనా చాలామంది సందర్శకులు వీకెండ్ వచ్చిందంటే సరదగా ట్రిప్ ప్లాన్ చేస్తుంటారు. ఎక్కడికి వెళ్దామా అని చూస్తుంటారు.

ఈ రెయిన్ సీజన్ లో మీరు కూడా ఎక్కడికైనా ట్రిప్ ప్లాన్ చేస్తుంటే.. మీకోసం మన తెలంగాణ పరిసర ప్రాంతాల్లోనే అనేక అందమైన జలపాతాలు ఉన్నాయి. ఈ వర్షపు సమయంలో చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఎక్కడికో వెళ్లాల్సిన పనిలేదు. అందులోనూ హైదరాబాద్ చుట్టూ పరిసర ప్రాంతాల్లో దాదాపు 100కి.మీ నుంచి 300 కి.మీ దూరంలోనే అద్భుతమైన జలపాతాలు ఉన్నాయి.. ఈ వర్షాకాలంలో ఆహ్లాదకర వాతావరణంలో సరదాగా గడపాలంటే కుటుంబం లేదా స్నేహితులతో వెళ్ళి ఎంజాయ్ చేసి రావచ్చు.. ఇంతకీ ఆయా జలపాతాలేంటి? ఎక్కెడక్కడ ఉన్నాయి అనేది ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

హైదరాబాద్ దగ్గరలోని అందమైన జలపాతాలివే :
ఎత్తిపోతల జలపాతం (150 కి.మీ) :
ఈ అందమైన జలపాతం రెండు తెలుగు రాష్ట్రాల మధ్యలో ఉంది. ఈ జలపాతం హైదరాబాద్ నగరానికి 150 కిలోమీటర్ల దూరంలో ఉంది. మూడు నదుల కలయికతో అందంగా ఉంటుంది. కృష్ణా నది ఉపనది చంద్రవంక నదీజలాలు ప్రవహిస్తుంటాయి. 70 అడుగుల ఎత్తునుండి నీళ్లు పడుతుంటాయి. ఈ అద్భుతమైన దృశ్యాన్ని వీక్షించేందుకు ప్రకృతి ప్రేమికులు, సందర్శకులు వెళ్తుంటారు.

కుంటాల జలపాతం (260 కి.మీ) :
తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ఎత్తైన జలపాతం. ఆదిలాబాద్ జిల్లా కుంటాల గ్రామానికి సమీపంలో కుంటాల జలపాతం ఉంది. 44 మీటర్ల ఎత్తు నుంచి నీళ్లు కిందికి జారుతుంటుంది. వర్షాకాలం సమయంలో ఈ జలపాతానికి పర్యాటకులు ఎక్కువగా వస్తుంటారు. ఈ జలపాతం హైదరాబాద్ నుంచి 260 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆదిలాబాద్-నిర్మల్ 44వ జాతీయ రహదారి నుంచి వెళ్లొచ్చు. నేరేడిగొండ మండలం నుంచి 12 కిలోమీటర్ల దూరంలో ఉంది.

Read Also : Vivo T4 Lite : వివో క్రేజే వేరబ్బా.. 6000mAh భారీ బ్యాటరీతో వివో T4 లైట్ ఫోన్ జస్ట్ రూ. 10వేల లోపే.. ఇంత తక్కువకు మళ్లీ రాదు..!

మల్లెల తీర్థం (185 కి.మీ) :
నాగర్ కర్నూల్ జిల్లాలో ఈ మల్లెల తీర్థం జలపాతం ఉంది. మన హైదరాబాద్ నుంచి 185 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ జలపాతం 150 అడుగుల ఎత్తు నుంచి నీరు జాలువారుతుంది. నల్లమల అడవుల్లో ఈ జలపాతం అత్యంత ఆకర్షణీయంగా ఉంటుంది. పర్యాటకులను చాలా ఆకట్టుకుంటుంది. దట్టమైన అడవిలో ట్రెక్కింగ్ చేసేవారికి సరదాగా ఉంటుంది. ట్రెక్కింగ్, క్యాంపింగ్ ఇక్కడ ప్రత్యేకత.

బోగత జలపాతం (280 కి.మీ) :
ఈ జలపాతంలో తెలంగాణ రాష్ట్రంలో ఉంది. బోగత జలపాతాన్ని తెలంగాణ నయాగరా జలపాతంగా చెబుతారు. అడవుల మధ్యలో ప్రవహించే జలాలు చాలా అద్భుతంగా ఉంటాయి. ములుగు ఖమ్మం జిల్లా వాజేడు మండలం (చీకుపల్లి) బోగత గ్రామ సమీపంలో ఈ అందమైన జలపాతం ఉంది. వరంగల్ నుంచి 130 కి.మీ భద్రాచలం నుంచి 120 కిలోమీటర్ల దూరంలో ఉంది. హైదరాబాద్ నుంచి 269 నుంచి 280 కి.మీ దూరంలో ఉంటుంది. స్విమ్మింగ్, బొగటేశ్వర స్వామి ఆలయం, అడవిలో ట్రెక్కింగ్ వంటివి ఆకట్టుకునేలా ఉంటాయి.

భీముని పాదం జలపాతం (200 కి.మీ) :
ఈ అందమైన జలపాతం తెలంగాణ రాష్ట్రంలోని మహబూబాబాద్‌లోని గూడూరు మండలం సీతానగరం గ్రామంలో ఉంది. గూడూరు బస్టాండ్ నుంచి 10 కి.మీ దూరంలో వరంగల్ నుంచి 55 కి.మీ, ఖమ్మం బస్ స్టేషన్ నుంచి 88 కి.మీ, హైదరాబాద్ నుంచి 200 కి.మీ దూరంలో ఉంది. సూర్యోదయ సమయంలో ఈ జలపాతం అద్భుతంగా ఉంటుంది.

పొచ్చెర జలపాతం (267 కి.మీ) :
ఆదిలాబాద్ జిల్లాలో కుంటాల జలపాతం తర్వాత పొచ్చెర జలపాతం అద్భుతంగా ఉంటుంది. ఈ అందమైన జలపాతం బోథ్ మండలం పొచ్చర గ్రామ శివారులో ఉంది. భారీ వర్షాల సమయంలో జలకళను సంతరించుకుంటుంది. సందర్శకులను ఆకట్టుకునేలా ఉంటుంది. ఈ జలపాతాన్ని వీక్షించేందుకు పర్యాటకులు పోటెత్తుంటారు. ఈ పొచ్చెర జలపాతం హైదరాబాద్ నుంచి 255 నుంచి 267 కి.మీ మధ్య దూరం ఉంటుంది.

జలపాతాల వద్ద జాగ్రత్త.. :
మీరు కూడా జలపాతాల సందర్శన కోసం వెళ్తుంటే జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే.. ఈ భారీ వర్షాల సమయంలో ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలో ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు మూసి వాగుకు వరద పెరుగుతోంది.

వరద నీరు పోటు ఎత్తడంతో శంషాబాద్ మండలం నానాజీపూర్ వద్ద మూసి ప్రవాహం వాటర్ ఫాల్స్ మాదిరిగా తలపిస్తోంది. ఈ మార్గంలో వాటర్ ఫాల్స్ వద్దకు వెళ్లకుండా సందర్శకులను అడ్డుకునేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. గతంలోనూ సందర్శకులు తాకిడి ఎక్కువై నానాజీ పూర్ వాటర్ ఫాల్స్ వద్ద ప్రమాదాలు జరిగాయి.