Vivo T4 Lite : వివో క్రేజే వేరబ్బా.. 6000mAh భారీ బ్యాటరీతో వివో T4 లైట్ ఫోన్ జస్ట్ రూ. 10వేల లోపే.. ఇంత తక్కువకు మళ్లీ రాదు..!

Vivo T4 Lite : వివో T4 లైట్ వెర్షన్ ఫోన్ డిస్కౌంట్ ధరకే లభిస్తోంది. ఏకంగా రూ. 10వేల లోపు ధరకే ఇంటికి తెచ్చుకోవచ్చు.

Vivo T4 Lite : వివో క్రేజే వేరబ్బా.. 6000mAh భారీ బ్యాటరీతో వివో T4 లైట్ ఫోన్ జస్ట్ రూ. 10వేల లోపే.. ఇంత తక్కువకు మళ్లీ రాదు..!

Vivo T4 Lite

Updated On : July 22, 2025 / 6:20 PM IST

Vivo T4 Lite : వివో లవర్స్‌కు గుడ్ న్యూస్.. వివో T4 లైట్ ఫోన్ భారీగా తగ్గింది. 6000mAh బ్యాటరీతో ఈ స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు రూ. 10వేల కన్నా తక్కువ (Vivo T4 Lite) ధరకు అందుబాటులో ఉంది. ఈ ఏడాదిలో లాంచ్ అయిన వివో T4 లైట్ ధర రూ. 4వేలు తగ్గింది. అదనంగా, ఈ వివో ఫోన్ కొనుగోలుపై అనేక బ్యాంక్ ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. సరసమైన స్మార్ట్‌ఫోన్‌ను కొనేందుకు ప్లాన్ చేస్తుంటే.. ఈ అద్భుతమైన డీల్ అసలు వదులుకోవద్దు.

వివో T4 లైట్ ధర డిస్కౌంట్ :
వివో T4 లైట్ ఫోన్ అనేది వివో T4 సిరీస్‌ (Vivo T4 Lite)లో అత్యంత సరసమైనది. ఈ స్మార్ట్‌ఫోన్ మొత్తం 3 స్టోరేజ్ వేరియంట్‌లలో లభిస్తుంది. 4GB ర్యామ్ + 128GB, 6GB ర్యామ్ + 128GB, 8GB ర్యామ్ + 256GB ఉన్నాయి. ఆసక్తిగల కొనుగోలుదారులు ఈ వివో ఫోన్‌ను రూ. 9,999 ధరకే పొందవచ్చు.

Read Also : Samsung Galaxy S26 Ultra : కొత్త శాంసంగ్ S26 అల్ట్రా ఫోన్ వచ్చేస్తోంది.. లాంచ్ ఎప్పుడు? ధర, స్పెషిఫికేషన్లు ఇవే? ఫుల్ డిటెయిల్స్..!

ఫ్లిప్‌కార్ట్‌లో టాప్ రిటైల్ ధర రూ. 13,999కు పొందవచ్చు. టాప్ వేరియంట్‌ ధర రూ. 12,999కు కొనుగోలు చేయవచ్చు. ఈ వివో ఫోన్ ప్రిజం బ్లూ, టైటానియం గ్రే రెండు కలర్ ఆప్షన్లలో వస్తుంది. టైటానియం గ్రే వేరియంట్ శాంసంగ్ గెలాక్సీ S25 ఎడ్జ్ (Samsung Galaxy S25 Edge) మాదిరిగా లుక్ ఉంటుంది.

వివో T4 లైట్ స్పెసిఫికేషన్లు :
వివో T4 లైట్ 6.74-అంగుళాల HD+ డిస్‌ప్లేను (Vivo T4 Lite) కలిగి ఉంది. 1,000 నిట్స్ గరిష్ట ప్రకాశంతో 90Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌తో పాటు 8GB వరకు ర్యామ్, 256GB వరకు ఇంటర్నల్ స్టోరేజీని విస్తరించవచ్చు. వివిధ ఏఐ ఫీచర్లను కూడా కలిగి ఉంది. ఈ వివో ఫోన్ 6,000mAh బ్యాటరీతో 44W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది.

ఈ వివో ఫోన్ IP64 రేటింగ్‌ను కలిగి ఉంది. డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 15 ఆధారంగా FuntouchOSపై రన్ అవుతుంది. బ్యాక్ సైడ్ 50MP మెయిన్ కెమెరా, 2MP సెకండరీ కెమెరాతో డ్యూయల్-కెమెరా సెటప్‌ కలిగి ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్‌ల కోసం 5MP ఫ్రంట్ కెమెరా కూడా ఉంది.