TPCC chief revanth reddy
Revanth Reddy : రాజశేఖర్ రెడ్డి తరువాత నేనే..నేను పీసీపీ చీఫ్ అయ్యాకే తెలంగాణ కాంగ్రెస్ లో ఎన్నో మార్పులొచ్చాయి.పార్టీకి పెరిగింది..గతంలో జరగని కార్యక్రమాలు ఈ రెండేండ్లలో జరిగాయి
అంటూ పీసీసీ చీఫ్ రేవంత్ ఆసక్తికర వాఖ్యలు చేశారు. తాను పీసీపీ చీఫ్ అయ్యాకే రెండేళ్లుగా తెలంగాణ కాంగ్రెస్ కి ప్రాధాన్యత పెరిగింది అంటూ వ్యాఖ్యానించారు. వ్యక్తులకు ప్రాధాన్యత పెరగలేదు. పార్టీకి పెరిగింది నేను పీసీసీ చీఫ్ అయ్యాక కోట్లాడి మా నాయకులకు పదవులు తెస్తున్నాను అంటూ వ్యాఖ్యానించారు. గతంలో జరగని కార్యక్రమాలు ఈ రెండేండ్లలో జరిగాయి ని..నేను పీసీసీ చీఫ్ అయ్యాక అనేక మంది జాతీయ నాయకులు వరుసగా తెలంగాణకి వస్తున్నారని అన్నారు.
తెలంగాణ వచ్చిన తర్వాత నుండి 2021 వరకు156 మంది కీలక నాయకులు కాంగ్రెస్ పార్టీని వీడారని.. 2021 జూలై నుండి ఇప్పటి వరకు పార్టీ మారిన వాళ్ళు, వచ్చిన వాళ్ల లెక్క వేయండి మీకే తెలుస్తుంది అంటూ చెప్పుకొచ్చారు.గతంలో సిట్టింగ్ ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ నుండి వెళ్ళిపోయేవారు..కానీ ఇప్పుడు సిట్టింగులు కాంగ్రెస్ లోకి వస్తున్నారు ఇదంతా నేను పీసీపీ అయ్యాకే అంటూ వ్యాఖ్యలు చేశారు. రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు కమ్యూనిస్టులు గాంధీ భవన్ వచ్చి చర్చలు జరిపారు. ఆయన తరువాత నేను పీసీసీ చీఫ్ అయ్యాకే వస్తున్నారు అంటూ చెప్పుకొచ్చారు.
YS Sharmila : హోంగార్డు రవీందర్ చావుకు ముమ్మాటికీ కేసీఆర్ ప్రభుత్వమే కారణం : వైఎస్ షర్మిల
ఎన్నికలున్న వేరే రాష్ట్రాల్లో CWC సమావేశాలు పెట్టకుండా తెలంగాణకే అవకాశం ఇచ్చారంటే తెలంగాణ కాంగ్రెస్ కి జాతీయ నాయకత్వం ఇస్తున్న ప్రాధాన్యత ఏంటో అర్థం చేసుకోవచ్చన్నారు.రెండేళ్లుగా మేం చేసినటువంటి సభలు అధికార పార్టీ కూడా చేయలేకపోయింది అంటూ ఎద్దేవా చేశారు. మేం చేసిన గజ్వేల్, ఖమ్మం, ఇంద్రవెల్లి లాంటి సభలు కేసీఆర్ కూడా చేయలేకపోయారంటూ సెటైర్ వేశారు. ఎన్నికల విషయంలో కేసీఆర్ మోదీతో ఒప్పందం చేసుకున్నారు అందుకే జనవరిలోనే అసెంబ్లీ ఎన్నికలు వస్తాయని కేసీఆర్ భావిస్తున్నారు అంటూ ఆరోపించారు. కేసీఆర్ తన పాలసీలను ఆయన పత్రికలో వ్యాసాలు, వార్తలుగా ప్రచురిస్తున్నారని..అసెంబ్లీ ఎన్నికలు జనవరిలో వస్తాయని కేసీఆర్ తన పత్రికలో రాయించారని ఇదంతా మోదీతో జరిగిన ఒప్పందమేనని ఆరోపించారు.