Revanth Reddy : ఉచిత కరెంట్‌పై నా వ్యాఖ్యలను వక్రీకరించారు.. సందు దొరికిందని బీఆర్ఎస్ ఆ పనిలో ఉంది : రేవంత్ రెడ్డి

బీఆర్ఎస్ కు ఏదో సందు దొరకినట్లుగా నేతలు చిల్లర విమర్శలు చేస్తున్నారు.అసలు ఉచిత కరెంట్ ఇచ్చింది కాంగ్రెస్సే. దీనిపై బీఆర్ఎస్ తో చర్చకు తాను సిద్ధంగా ఉన్నా..

Revanth Reddy Free Power Issue

Revanth Reddy Free Power Issue : అమెరికా పర్యటనలో రేవంత్‌రెడ్డి చేసిన ‘ఉచిత కరెంట్’ వ్యాఖ్యలు తెలంగాణలో పెను దుమారాన్ని కలిగించాయి. సొంతపార్టీ నేతలు సైతం రేవంత్ వ్యాఖ్యలను ఖండించారు. తానా సభలకు అమెరికా వెళ్లిన రేవంత్ రెడ్డి తెలంగాణ రైతులకు ఉచితంగా 24 గంటలు కరెంట్ ఇవ్వాల్సిన అవసరంలేదని మూడు గంటలు ఇస్తే చాలనీ.. కేసీఆర్ అనవసరంగా 24 గంటలు ఉచిత కరెంట్ ఇస్తున్నారని ఇది అవసరం అంటూ వ్యాఖ్యానించారు.

ఈ వార్తలపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు సైతం మండిపడుతున్నారు. ఇక బీఆర్ఎస్ నేతలైతే వచ్చిన అవకాశాన్ని వదులుకోకుండా కాంగ్రెస్ పైనా రేవంత్ పైనా మండిపడుతున్నారు. బీఆర్ఎస్ మంత్రులు రేవంత్ ను ఓ రేంజ్ లో ఆడుకున్నారు విమర్శలతో, కేటీఆర్,హరీశ్ రావు, పువ్వాడ, జగదీశ్ రెడ్డి ఘాటు విమర్శలు చేశారు.

Telangana Congress: కాకరేపిన ‘కరెంట్’ కామెంట్లు.. రేవంత్‌రెడ్డిపై రగులుతున్న సీనియర్లు

దీంతో రేవంత్ పునరాలోచనలో పడినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి వివరణ ఇస్తు ‘ఉచిత కరెంట్’ పై తాను చేసిన వ్యాఖ్యల్ని వక్రీకరించారు అంటూ బీఆర్ఎస్ నేతలు చేసిన విమర్శలకు కౌంటర్ ఇచ్చారు. బీఆర్ఎస్ కు ఏదో సందు దొరకినట్లుగా చిల్లర విమర్శలు చేస్తోందంటూ మండిపడ్డారు. అసలు ఉచిత కరెంట్ ఇచ్చింది కాంగ్రెస్సేనని స్పష్టంచేశారు. దీనిపై బీఆర్ఎస్ తో చర్చకు తాను సిద్ధంగా ఉన్నానన్నారు. ఉచిత విద్యుత్ పై తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరించి చిల్లర విమర్శలు చేస్తున్నారంటూ మండిపడ్డారు.

వైఎస్సార్ హయాంలో రైతులకు 7 గంటలు ఉచిత విద్యుత్ ఇచ్చామని గుర్తు చేశారు. రైతును రాజును చేయటానికి కాంగ్రెస్ ఎంతో కృషి చేసిందని ఇప్పుడు కొత్తగా బీఆర్ఎస్ రైతుల కోసం చేసిందేమీ లేదన్నారు. రైలుకు రుణమాఫీలు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమని గుర్తు చేశారు. రైతులకు ఉచిత విద్యుత్‌ను తీసుకువచ్చిందే కాంగ్రెస్‌ పార్టీ. బషీర్‌బాగ్‌ కాల్పుల ఘటన జరిగినప్పుడు కేసీఆర్‌ తెలుగుదేశం పార్టీలో ఉన్నారని అన్నారు రేవంత్ రెడ్డి.

Revanth Reddy : తెలంగాణలో దుమారం రేపుతున్న రేవంత్ రెడ్డి ‘ఉచిత కరెంట్’ వ్యాఖ్యలు

ఉచిత విద్యుత్‌తో పాటు రాయితీపై ఎన్నో వ్యవసాయ పనిముట్లు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అంటూ చెప్పుకొచ్చారు. ఉచిత విద్యుత్‌ పేటెంట్‌ కాంగ్రెస్‌ పార్టీదే అంటూ రేవంత్ రెడ్డి స్పష్టంచేశారు. ఇలా ఏదో రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చింది దేశంలో తామే మొదటివారం అని బీఆర్ఎస్ చెప్పుకోవటం సిగ్గుచేటన్నారు.