Tpcc
TPCC President : టీపీసీసీ అధ్యక్షుడిగా ప్రమాణం స్వీకారం చేసి 24 గంటలు గడువకముందే…టీపీసీసీ తొలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కీలక అంశాలపై చర్చించారు. 2021, జూలై 07వ తేదీ బుధవారం మధ్యాహ్నం గాంధీ భవన్ లో పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. అనంతరం జూలై 08వ తేదీ గురువారం నూతన టీపీసీసీ తొలి సమావేశం జరిగింది. పలు కీలక అంశాలపై చర్చించారు. అంశాల వారీగా పాదయాత్ర చేపట్టాలని రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకోవడం గమనార్హం. పార్లమెంట్ సమావేశాల తర్వాత..పాదయాత్రపై క్లారిటీ రానుందని తెలుస్తోంది.
Read More : AP CID : సీఎం జగన్ పై తప్పుడు ప్రచారం చేసే వారిపై చర్యలు తీసుకోండి, సీఐడీకి ఫిర్యాదు
పీసీసీ అధ్యక్షుడు రేవంత్ అధ్యక్షతన జరిగిన టీపీసీసీ (TPCC) తొలి సమావేశం వాడీవేడీగా జరిగింది. పది గంటలకు ప్రారంభమైన ఈ సమావేశం సుమారు మూడు గంటల పాటు కొనసాగింది. సమావేశంలో పార్టీ బలోపేతంపై చర్చించారు. రాష్ట్రంలో నెలకొన్న సమస్యలపై చర్చించారు. కృష్ణా జలాలు, నిరుద్యోగం ఇతర కీలక అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ప్రధానంగా నిరుద్యోగ సమస్యపై పాదయాత్ర చేయాలని భావించారు. కానీ తాను ఎంపీగా ఉన్న సమయంలో..పార్లమెంట్ సమావేశాల అనంతరం పాదయాత్రలపై నిర్ణయం తీసుకుందామని, ఆఘమేఘాలపై నిర్ణయం తీసుకోవడం బాగుండదని రేవంత్ అభిప్రాయం వ్యక్తం చేశారు.
Read More : Action immediately : కరోనా కేసుల కట్టడికి కఠిన చర్యలు తీసుకోండి.. 8 రాష్ట్రాలకు కేంద్రం లేఖ
పరిపాలనకు సంబంధించి ఐఏఎస్, ఐపీఎల్ ల విషయంలో సీరియస్ గా ఉండాలని, ఈ అధికారులపై విచారణ జరపాలనే డిమాండ్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. బినామీలను పెట్టుకుని వేల కోట్ల రూపాయలు సంపాదించారని టీపీసీసీ అభిప్రాయం వ్యక్తం చేసింది. త్వరలో పార్టీ నాయకులకు శిక్షణా తరగతులు నిర్వహించాలని, ప్రతివారం పార్టీ చీఫ్, వర్కింగ్ ప్రెసిడెంట్ ల కమిటీ, కమిటీ ఛైర్మన్లు భేటీ కావాలని కీలక నిర్ణయం తీసుకున్నారు.
Read More : CM Jagan : చెదరని చిరునవ్వు, పోరాడే గుణం, మాట తప్పని నైజం.. ఇవన్నీ నువ్వు నేర్పినవే నాన్నా
అలాగే ఎమ్మెల్యేల అనర్హత వేటుపై న్యాయపరమైన చర్యలు వేగవంతం చేయాలనే అభిప్రాయం వ్యక్తం చేశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై జనంలో చర్చకు పెట్టాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు నేతలు అభిప్రాయాలు వ్యక్తం చేశారు.