TPCC : రెండేళ్లు కష్టపడండి..కాంగ్రెస్ శ్రేణులకు రేవంత్ పిలుపు

Revanth Reddy

TPCC President Revanth Reddy : రెండు సంవత్సరాలు పాటు కష్టపడండి…రాష్ట్రంలో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొచ్చేందుకు కృషి చేయాలని కాంగ్రెస్ శ్రేణులకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. 2021, జూలై 07వ తేదీ బుధవారం మధ్యాహ్నం 1.30 గంటలకు టీపీసీసీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన అనంతరం గాంధీ భవన్ లో కాంగ్రెస్ బహిరంగసభ నిర్వహించింది. ఈ సందర్భంగా..రేవంత్ మాట్లాడారు. ప్రభుత్వంపై పలు విమర్శలు సంధించారు. కాంగ్రెస్ అధికారంలోకి తెచ్చేందుకు ప్రతొక్క కార్యకర్త నడుం బిగించాలని పిలుపునిచ్చారు.
Read More : Covid-19 Vaccine Certificate: కొవిడ్ వ్యాక్సిన్ సర్టిఫికేట్ డౌన్‌లోడ్ చేసుకోండిలా..!

అందరికీ ధన్యవాదాలు :- 
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా..బాధ్యతలు అప్పచెప్పినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియచేస్తున్నట్లు వెల్లడించారు. అందరి ఆకాంక్షలకు అనుగుణంగా…పని చేస్తానని తెలిపారు. వ్యక్తిగతపరంగా స్లోగన్ ఇవ్వొద్దు..అని కాంగ్రెస్ శ్రేణులకు వార్నింగ్ ఇచ్చారు. 60 ఏళ్ల కల సాకారం చేసి..తెలంగాణ రాష్ట్రం ఇస్తే..కేసీఆర్ కుటుంబంలో చేతిలో బంధీ అయ్యిందని విమర్శించారు.

Read More : AP : ఇంటర్ ఫైనల్ ఇయర్ మార్కుల అసైన్ మెంట్ ఖరారు..
తెలంగాణ తల్లి సోనియా గాంధీ :- 

తెలంగాణకు పెద్ద దిక్కు లేకుండా అయ్యిందని, సోనియాను తెలంగాణ తల్లిగా అభివర్ణించారాయన. సమిష్టి నిర్ణయాలతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. సమైక్య రాష్ట్రంలో కష్టాలు చూసి..శ్రీకాంత చారి ఆత్మబలిదానం చేసుకున్నారని గుర్తు చేశారాయన. రాష్ట్రంలో ప్రతింటికి వెళ్లి…రాష్ట్రంలో ఉన్న కష్టాలను వెల్లడించాలని కాంగ్రెస్ శ్రేణులకు సూచించారు.

Read More : Telangana High Court : ఉస్మానియా భవన నిర్మాణంపై అలసత్వం ఎందుకు ? ప్రభుత్వ తీరుపై హైకోర్టు అసహనం
ప్రతొక్కరూ కష్టపడాలి :- 

రాష్ట్రంలో ఉద్యోగాలు ఇచ్చామని సీఎం కేసీఆర్ చెబుతున్నారని..తెలంగాణ రాష్ట్రంలో గతంలో లక్షా 7 వేలు ఖాళీలుంటే..ఇప్పుడు లక్షా 91 వేల ఖాళీలు ఎలా అయ్యాయని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి. తెలంగాణ ద్రోహులంతా మంత్రులయ్యారని, రాష్ట్రంలో టీఆర్ఎస్, కేంద్రంలో బీజేపీని ఓడించడం కోసం కష్టపడాలని, ఇందుకు రెండేళ్ల కాలం పాటు అహర్నిశలు కృషి చేయాలన్నారు.