AP : ఇంటర్ ఫైనల్ ఇయర్ మార్కుల అసైన్ మెంట్ ఖరారు..

ఏపీ ప్రభుత్వం ఇంటర్ ఫైనల్ ఇయర్ మార్కుల అసైన్ మెంట్ ఖరారు చేసింది. టెన్త్‌లో టాప్‌ 3 సబ్జెక్టులకు వచ్చిన మార్కుల ఆధారంగా 30 శాతం మార్కులు ఇవ్వనుంది. అలాగే… ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరంలో సబ్జెక్టు వైజ్‌ మార్కులకు 70 శాతం మార్కులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

AP : ఇంటర్ ఫైనల్ ఇయర్ మార్కుల అసైన్ మెంట్ ఖరారు..

Ap Govt Is Finalized

Updated On : July 7, 2021 / 4:10 PM IST

Inter Final Year Marks in AP : ఏపీ ప్రభుత్వం ఇంటర్ ఫైనల్ ఇయర్ మార్కుల అసైన్ మెంట్ ఖరారు చేసింది. టెన్త్‌లో టాప్‌ 3 సబ్జెక్టులకు వచ్చిన మార్కుల ఆధారంగా 30 శాతం మార్కులు ఇవ్వనుంది. అలాగే… ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరంలో సబ్జెక్టు వైజ్‌ మార్కులకు 70 శాతం మార్కులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇంటర్ ప్రాక్టికల్‌ పరీక్షలు పూర్తైనందున వాటి ఫలితాల ఆధారంగా మార్కులు ఇవ్వనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ఈ నెలాఖరు లోపు ఇంటర్ విద్యార్థులకు మార్కుల మెమోలు జులై నెల ఆఖరుకు జారీ చేస్తామని ప్రకటించింది ప్రభుత్వం వెల్లడించింది.

కాగా.. విద్యాశాఖపై సమీక్ష నిర్వహించిన సీఎం జగన్‌..నూతన విద్యా విధానం ప్రతిపాదనలను ఈ వారంలో ఖరారు చేయాలని అధికారులకు ఆదేశించారు. నాడు – నేడు పనులను యాథవిధిగా కొనసాగించాలని… షెడ్యూలు ప్రకారం పనులు పూర్తికావాలని ఆదేసించారు.ఆయా స్కూళ్లలో విద్యార్థుల సంఖ్యలకు తగినట్టుగా టీచర్లు ఉండాలని..రాష్ట్రంలో ఒక్క స్కూలు కూడా మూతపడకూడదని ఆదేశించారు.

జులై 15 నుంచి ఆగస్టు 15వరకు వర్క్‌బుక్స్‌పై ట్రైనింగ్ ఇవ్వాలని తెలిపారు. సీఎం జగన్‌ ఈరోజు ఉదయం క్యాంపు కార్యాలయంలో సమీక్ష చేపట్టిన సందర్భంగా విద్యాశాఖ అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. ఈ సమావేశానికి విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌, పలువురు విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు.